Friday, 2 October 2020

‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ టీజర్: సినిమా నందుది.. సుధీర్ ఫ్యాన్స్ హంగామా!

నటుడు నందు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన నందు.. ఆ తరవాత హీరోగా మారారు. కానీ, ఇప్పటి వరకు సరైన బ్రేక్ అయితే రాలేదు. అందుకే ఈసారి తన స్క్రీన్ నేమ్‌ను మార్చుకొని మరీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కోసం నందు విజయ్ కృష్ణ అని పేరు మార్చుకున్నారు. నందు సరసన హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, నందు-రష్మీ గౌతమ్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నందు ప్రముఖ ద‌ర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్ ఫ్యాన్‌గా కనిపించనున్నారు. నందు పోషించిన పోతురాజు పాత్ర వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని, నందు పాత్రకు ధీటుగా ర‌ష్మీ గౌత‌మ్ రోల్ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. See Photos: విజయీభవ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడదులకు సిద్ధంగా ఉందని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూర్చారు. సుజాలా సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు. సుధీర్ ఫ్యాన్స్ హంగామా.. ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ సినిమాలో రష్మీ గౌతమ్ హీరోయిన్‌గా నటించడం వల్ల ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన టీజర్ కింద కామెంట్లన్నీ సుధీర్, రష్మీ గౌతమ్ అభిమానులు పెట్టినవే. సుధీర్ ఫ్యాన్స్ అంతా రష్మీ గౌతమ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామని కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cNWP9K

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw