Sunday, 25 October 2020

Bigg Boss Telugu 4: లాస్యది కన్నింగ్ స్మైల్, మోనాల్ ప్రేమ పంచుతోంది, అన్నీ నేర్పుతోంది: ఇచ్చిపారేసిన సమంత

అక్కినేని కోడలా మాజాకా.. నాగార్జున అన్నట్టుగానే ఆయనంత సాఫ్ట్ కాదు సమంత.. బిగ్ బాస్ హౌస్‌లో తెర వెనుక బాగోతాల్ని కుండబద్దలుకొట్టినట్టు బట్టబయలు చేస్తోంది. అఫ్ కోర్స్ ఇది కూడా బిగ్ బాస్ ఆడించే ఆటే అయినప్పటికీ జనం నోళ్లలో నానే మాటల్ని అంటుంటే మస్త్ మజా అనిపించింది. నాగార్జున స్థానంలో ఆదివారం నాడు బిగ్ బాస్ హోస్ట్‌గా అలరించిన సమంత ఒక్కో ఇంటి సభ్యుడి గురించి మాట్లాడుతూ అలరించింది. టాక్ బ్యాక్‌లో బిగ్ బాస్ డైరెక్టర్లు చెప్పిందే మాట్లాడకుండా సమయస్పూర్తితో వ్యవహరించినట్టే కనిపించింది. ఇక్కడికి వచ్చే ముందు ఇంటిలో ఉన్న వాళ్ల గురించి తెలుసుకున్నానని.. ఇంటిలో ఉన్న ఒక్కో అమ్మాయి గురించి రెండు నిమిషాలు చెప్తా అని.. అరియానాతో మొదలుపెట్టింది సమంత. అరియానాని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్టుగా ఉందని చెప్తూ.. నువ్ ఫైటర్‌వి అని ప్రశంసించింది. ఇక దివి అందంగా ఉంటే సరిపోదని.. ఇప్పుడిప్పుడే ఆట ఆడటం మొదలుపెట్టినట్టు అనిపిస్తుందని చెప్పింది. హారిక.. అభిజిత్ విషయంలో కాస్త ఓవర్ అవుతున్న విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ.. బిగ్ బాస్‌నే అన్ ఫెయిర్ అంటున్నావ్.. అభిజిత్ అంటే ఫ్యామిలీ కంటే ఎక్కువా అని అడగడంతో.. ముందు ఫ్యామిలీనే కానీ.. అభిజిత్ నెక్స్ట్ అంటూ అభిజిత్‌పై ప్రేమను ఒలకబోసింది హారిక. ఇక లాస్య గురించి మాట్లాడుతూ.. ‘నవ్వుతూనే అందర్నీ బుట్టలో పడేస్తుంది’ అని పంచ్ వేసింది. ‘నీది అవార్డ్ విన్నింగ్ స్మైలా?. కానీ నీది కన్నింగ్ స్మైల్ అంటుంటారే అని లాస్య‌కి డైరెక్ట్ పంచ్ వేసిన సమంత.. వాళ్లు అలా కన్నింగ్ స్మైల్ అనుకున్నా.. నాకైతే విన్నింగ్ స్మైల్‌ కనిపిస్తుంది’ అని కూల్ చేసింది. కానీ చాలా సేఫ్‌గా ఆడుతున్నావ్.. గాసిప్ క్వీన్.. బిగ్ బాస్‌కి వచ్చాక సేఫ్ మర్చిపోవాలని చెప్పిన సమంత లాస్య.. ఫేక్ నవ్వుని బయటపెట్టడమే కాకుండా ఆమె సేఫ్ గేమ్‌ని బహిర్గతం చేసింది. ఇక మోనాల్‌తో ఆటాడుకుంది సమంత. నవ్వుతూనే ఇవ్వాల్సింది గట్టిగానే ఇచ్చిపారేసింది. ‘మోనాల్ 7 వారాల్లో తెలుగు చాలా బాగా నేర్చుకుంది.. బిగ్ బాస్ హౌస్‌లో చాలా మందికి చాలా నేర్పుతుంది. ప్రేమ చాలా మందికి పంచుతుంది. ప్రేమించడం నేర్పుతుంది’ అంటూ సెటర్లు వేసింది. ఏంటి నేను మాట్లాడుతుంటే ఎవరూ మాట్లాడటం లేదు.. నేను నిజం చెప్పలేదా? అంటూ సెటైర్లు వేసింది సమంత. ఇంతలో అఖిల్ దొంగ చూపులు చూస్తూ తెగ ఫీల్ అయిపోయాడు. అయితే మోనాల్ మాట్లాడుతూ.. ‘నేను గేమ్ ఆడటానికి వచ్చా.. అదే చేస్తున్నా.. చాలా మందికి అర్థం కావడం లేదు’ అని ఏడ్వడం మొదలుపెట్టింది మోనాల్. ‘నేను నీకు ఒక సలహా చెప్పనా.. నేను నా ఇంట్లో చైతూతో అయినా చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు నేను స్టైట్‌గా మాట్లాడితే క్లారిటీతో చెప్తారు.. కానీ ఏడ్వడం మొదలుపెడితే.. ఆయనకు ఇంకా కోపం వస్తుంది.. ఎందుకు అంటే ఏడుపు ఒకసారే వర్కౌట్ అవుతుంది’ అని మోనాల్‌కి ఇచ్చిపారేసింది సమంత. అంత చెప్పినా.. మోనాల్ మళ్లీ తన ఏడుపు గొట్టు పెర్ఫామెన్స్ బయటకు తీసి కన్నీటి కుళాయి ఓపెన్ చేయడంతో.. ‘ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్.. దయచేసి ఏడ్వకు’ అని కూర్చోబెట్టేసింది సమంత. మొత్తానికైతే.. అరియానాపై ప్రశంసలు కురిపించడం.. మోనాల్, లాస్యల తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో మామ కంటే బెటర్ అనిపించింది సమంత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31FG3oS

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O