‘నేను ప్రేమిస్తున్నాను’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది బెంగాలీ భామ . జేడీ చక్రవర్తి హీరోగా ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నటనతో పాటు అందాలు ఆరబోసి తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘బావగారు బాగున్నారా’లో నటించి బ్రేక్ తెచ్చుకుంది. ఆ తర్వాత కన్యాదానం, రాయుడు, సుల్తాన్, మావిడాకులు, పిల్ల నచ్చింది, పెద్ద మనుషులు, నీతోనే ఉంటాను, లాహిరి లాహిరి లాహిరిలో.. వంటి సినిమాలు చేసి మంచిపేరు తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే రచన ఒక్కసారిగా కనుమరుగై పోవడం తెలుగు ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది.
అందంతో పాటు అభినయం కలగలసిన ఈ బెంగాలీ భామ ఒక్కసారిగా సినిమాలకు దూరం కావడానికి కారణం ఆమె చెడు అలవాట్లేనట. హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో రచన మద్యం, సిగరెట్లకు బానిసైందట. దీంతో అవకాశాలు తగ్గి డిప్రెషన్‌కు గురైందట. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు నచ్చజెప్పి బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రోబల్ బసు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. ఆ తర్వాత వైవాహిక జీవితంతో బిజీ కావడంతో పాటు ఇతర భాషల్లో అవకాశాలు రావడంతో రచన చెడు అలవాట్లకు పూర్తిగా దూరమైంది. బాబు పుట్టిన తర్వాత కూడా ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుండటంతో రచన కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి పాత్రలు ఇస్తే తెలుగులో మళ్లీ నటించేందుకు తాను రెడీ అని రచన చెబుతోంది. రచన బెనర్జీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఒడియా భాషల్లో కలిసి మొత్తం 200కు పైగా సినిమాల్లో నటించింది. from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31JJwTg
No comments:
Post a Comment