యంగ్ హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో ఉండే క్రేజే వేరు. అతడి సినిమా కోసం యూత్ ఎంతో ఆశగా చూస్తూ ఉంటుంది. పెళ్లిచూపులతో మొదలైన అతడి ప్రస్థానం అర్జున్‌రెడ్డితో ఊహించని స్థాయికి చేరింది. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్నాడు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు అక్రమాలకు తెరదీస్తున్నారు. విజయ్ దేవరకొండతో తీసే సినిమాకు ఆర్టిస్టులు కావాలంటూ ఆడిషన్స్ నిర్వహించి ఆశావాహుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. Also Read: ఈ విషయం విజయ్ టీమ్‌కి తెలియడంతో తీవ్రంగా స్పందించారు. తప్పుడు ప్రకటనలను నమ్మి ఎవరూ మోసపోవద్దంటూ ఓ ప్రకటన జారీ చేశారు. ‘విజయ్ దేవరకొండతో కలిసి సినిమా తీస్తున్నట్లు కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుగా ప్రకటనలు ఇస్తూ నటీనటులకు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆయన నటించే ఏ ప్రాజెక్ట్ అయినా విజయ్, నిర్మాతలు స్వయంగా ప్రకటిస్తారు. తప్పుడు ప్రకటలను నమ్మి ఎవరూ మోసపోవద్దు. ఇలా ప్రజలను మోసం చేస్తున్న వారిపై మేం చర్యలు తీసుకుంటాం’ అంటూ ప్రతినిధి అనురాగ్ పర్వతనేని ప్రకటన జారీ చేశారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32npWNr
No comments:
Post a Comment