Sunday, 13 September 2020

బిగ్ బాస్ సొహైల్‌కి మూడు బ్రేకప్ లవ్ స్టోరీలు.. డబ్బుకోసమే లవ్

లైఫ్‌లో సెటిల్ కాకుండా లవ్ చేస్తే లైఫ్ బిస్కెట్టే అంటున్నాడు సీజన్ 4 కంటెస్టెంట్ . ఇలాంటి బిస్కెట్లు నా లైఫ్‌లో చాలానే ఉన్నాయి అంటున్నాడు సొహైల్. తన లైఫ్‌లో మూడు బ్రేకప్‌ లవ్ స్టోరీలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు సొహైల్. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు నటుడు సొహైల్. కొత్త బంగారు లోకం, డీ ఫర్ దోపిడీ, అంతకు ముందు ఆ తరువాత, యురేక సినిమాలతో నటించిన సయ్యద్ సోహైల్.. క్రిష్ణవేణి సీరియల్‌తో పాపులర్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌస్‌కి రావడంతో తన లైఫ్ మారిపోతుందని ఆశపడుతున్న సొహైల్‌కి సంబంధించిన కొన్ని పాత ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిలో తన లవ్ బ్రేకప్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు సొహైల్. తనకు సినిమాలు అంటే పిచ్చి అని.. హీరో అయ్యి హిట్ కొట్టడమే తన గోల్ అంటున్నాడు సొహైల్. అయితే లైఫ్‌లో సెటిల్ కాకుండా లవ్ చేస్తూ అది ఎక్కువ కాలం నిలవదు బిస్కెట్ అవుతుందని అంటున్నాడు సొహైల్. ఇలా నా లైఫ్‌లో ఇప్పటికి మూడు బ్రేకప్ లవ్ స్టోరీలు ఉన్నాయన్నాడు సొహైల్. అయితే తన లవ్ బ్రేకప్ కావడానికి తన ప్రవర్తన కారణం కాదన్న సొహైల్.. తనకు సరైన ఇన్ కమ్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని అందుకే బ్రేకప్‌లు అయ్యాయని అంటున్నాడు. స్ట్రగుల్‌లో ఉన్న నాలాంటి యాక్టర్స్‌కి.. ఎన్నాళ్లు ఇలా ఉంటావ్.. ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా.. లాంటి సలహాలు వస్తుంటాయి. నా లైఫ్‌లో కూడా ఇలాంటివి వచ్చాయి. అయితే ఎన్ని కష్టాలు పడినా ఎంత టైం పట్టినా ఇండస్ట్రీని వదిలే ప్రసక్తి లేదని తెగేసి చెప్పడం నా బ్రేకప్‌లకు కారణం అంటున్నాడు సొహైల్. తాను కావాలనుకుంటే సౌదీ వెళ్లి మంచి జాబ్ చేయొచ్చని.. తన మామయ్యతో పాటు అమ్మవైపు బంధువులు అంతా సౌదీలోనే ఉన్నారని.. కాని అక్కడకి వెళ్లి జాబ్ చేయడం ఇష్టం లేదని అంటున్నాడు సోహైల్. అమ్మాయి కోసం నా కెరియర్‌ను వేస్ట్ చేసుకోలేను.. నేను ఇష్టపడ్డ రంగాన్ని వదలుకోలేను.. నువ్ సెటిల్ అయితేనే లవ్ కొనసాగిద్దాం అంటే.. ఆ అమ్మాయి నన్ను కాదు.. నా జాబ్‌ని ప్రేమిస్తుందని లెక్క అందుకే నన్ను ప్రేమించే అమ్మాయి కోసం చూస్తున్నా. ఇప్పుటికైతే మా అమ్మ ఎవర్ని చూపించి పెళ్లి చేసుకోమంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యా అంటూ చెప్పుకొచ్చాడు సొహైల్. ఇక మనోడి బిగ్ బాస్ ఆట విషయానికి వస్తే.. అరియానా గ్లోరితో సీక్రెట్ రూంలో ఉన్న సొహైల్‌కి ఆమె ఓవరాక్షన్ ద్వారా కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే గత రెండు రోజులుగా అరియానాకు దూరంగా ఉండి తన ఆట తను ఆడుకుంటూ అందరితో కలుస్తున్నాడు. కట్టప్ప టాస్క్ ఇష్యూలో నోయల్ తనకు తాను స్టాంప్ వేసుకోవడాన్ని వ్యతిరేకించిన సొహైల్‌కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ke5gNW

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....