Sunday, 16 February 2020

నందమూరి బాలయ్య సతీమణి వసుంధర సంతకం ఫోర్జరీ

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు ఎమ్మెల్యే సతీమణి అయ్యింది. బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఆమె సంతకం ఫోర్జరీ అయ్యిందని తెలుసుకొని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారో తెలుసుకొని షాక్ తిన్నారు. ఈ నెల 13న బంజారాహిల్స్ హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ రిలేషన్‌షిప్ మేనేజర్లు శ్రీనివాస్,చ ఫణి బాలయ్య అకౌంటెంట్ సుబ్బారావుకు ఫోన్ చేశారు. ఆయన సతీమణి వసుంధర అకౌంట్‌కు సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని.. యాక్టివేషన్ చేయాలా.. వద్దా అని అడిగారు. సీన్ కట్ చేస్తే తాము నెట్ బ్యాంకింగ్ కోసం అప్లూ చేయలేదని అకౌంటెంట్ చెప్పడంతో బ్యాంక్ మేనేజర్లు షాక్ తిన్నారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో బాలయ్య సతీమణి వసుంధరను సంప్రదించారు. ఆమె కూడా తాను నెట్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పడంతో దిమ్మ తిరిగింది. తర్వాత బ్యాంక్ అధికారులు ఏం జరిగిందని ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆమె సంతకం ఫోర్జరీ అయినట్లు తేలింది.. ఎవరు దరఖాస్తు చేశారని ఆరా తీశారు. వసుంధర పేరుతో ఉన్న డాక్యుమెంట్లపై ఉన్న సంతకాలను పరిశీలించారు. వసుంధర అకౌంటెంట్ సుబ్బారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంపై ఆరా తీయగా.. అదే బ్యాంకులో పనిచేస్తున్న అకౌంటెంట్ శివ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తేలింది. అతడే సంతకాన్ని ఫోర్జరీ చేసి మొబైల్‌ బ్యాంకింగ్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తేలింది. శివను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. సంతకాన్ని ఫోర్జరీ చేసిన శివ కూడా ఇటీవలే బ్యాంకులో ఉద్యోగిగా చేరినట్లు తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2u4jnkx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....