Saturday, 15 February 2020

టీజర్ వస్తోంది, గిఫ్ట్ రెడీ చేస్కో నాగచైతన్య: శేఖర్ కమ్ముల

ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించే శేఖర్ కమ్ముల మరో అందమైన లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. , సాయి పల్లవి జంటగా ‘లవ్‌స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. నిన్న ఈ సినిమాలోని ‘ఏయ్ పిల్లా’ అనే ప్రివ్యూని రిలీజ్ చేసారు. నాగచైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బాగా హైలైట్ అయింది. ఈ సందర్భంగా నాగచతన్య శేఖర్‌కు బ్లాక్ షేడ్స్ కానుకగా ఇచ్చారు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని శేఖర్ కమ్ముల ఎంజాయ్ చేస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అయితే చైతూ ఇచ్చిన గిఫ్ట్‌కు శేఖర్ ఇచ్చిన రిప్లై హైలైట్. ‘‘గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్యూ చై. తర్వాత టీజర్ వస్తోంది. ఇంకో గిఫ్ట్ రెడీ చేస్కో’ అన్నారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది సెలబ్రిటీలు నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ, శేఖర్ కమ్ముల టైమింగ్ గురించి ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. శేఖర్ కమ్ముల నుంచి ఎన్ని రకాల లవ్‌స్టోరీలు వచ్చినా అవి ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. అదీకాకుండా ఇప్పటివరకు నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించింది లేదు. ఓ ఫ్రెష్ పెయిర్‌తో ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. READ ALSO: ఈ పాట ప్రివ్యూ చూసి నాగచైతన్య భార్య సమంత, తండ్రి నాగార్జున తెగ సంతోషించేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నారాయణ్ దాస్, నరంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ సినిమాకు సంగీతం అందించారు. హరిచరణ్ ఈ పాటను పాడారు. See Photo Story:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SIjV82

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....