Sunday, 16 February 2020

రాహుల్‌కి నా చెల్లి నచ్చిందంట: పునర్నవి భూపాలం సెటైర్

సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొని ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు , రాహుల్ సిప్లిగంజ్. వీరిద్దరి కెమిస్ట్రీ చూసి నిజంగానే ప్రేమలో ఉన్నారేమో, పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారు. కానీ అది షోలో భాగంగా జరిగిన డ్రామానే కానీ నిజంగా తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పునర్నవి ‘ఒక చిన్న విరామం’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. వాలెంటైన్స్ డేకు సినిమా రిలీజ్ అయింది. మంచి టాక్ అందుకుంది. అయితే ఈ సినిమా చూసాక రాహుల్.. పున్నూకి ఓ మాట చెప్పాడట. ‘‘బిగ్‌బాస్ తర్వాత సినిమాకు ఓకే చేయడానికి లేట్ చేసానని చాలా మంది అంటున్నారు. ‘ఒక చిన్న విరామం’ కథ నచ్చే నేను ఓకే చేసాను. మంచి పాత్ర చేసాను. ఇక రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్ అని ఇప్పటికీ ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ అలాంటిదేమీ లేదు. నేను, రాహుల్ కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. మొన్న సినిమా రిలీజ్ అవడానికి ముందు నేను, రాహుల్ కలిసి వరుణ్ సందేశ్ వాళ్లింటికి వెళ్లాం. నా సినిమా ట్రైలర్ కూడా చూపించాను. వారికి నచ్చింది. సినిమా స్క్రీనింగ్‌కి కూడా వచ్చారు. రాహుల్ సినిమా చూసాక, ఈ సినిమాలో నా చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి బాగుంది అన్నాడు. ఆ చెల్లి ఎవరు అనేది తెలియాలంటే ‘ఒక చిన్న విరామం’ సినిమా చూడాల్సిందే. బిగ్‌బాస్ షో నా గురించి, రాహుల్ గురించి పెద్దగా చూపించేసింది కానీ మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదు. మేం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే నాకు పెళ్లి, ప్రేమ ఆలోచనలు అస్సలు లేవు’’ READ ALSO: ‘‘ నేను కేవలం నా కెరీర్‌పై ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేస్తాను. అయితే అక్క, చెల్లి, ఫ్రెండ్ పాత్రలో చేస్తే నాకున్న పాపులారిటీకి న్యాయం చేయలేను. సినిమాలో నా పాత్ర ఉందంటే.. అది ఎంత కీలకం అనేది చూస్తాను. సుధీర్, రష్మి కలిసి టీవీ షోలు చేస్తున్నారు. వాళ్లు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అదే విధంగా నేను, రాహుల్ టీవీ షోలు చేస్తామా అని అడుగుతున్నారు. ముందు నన్ను, రాహుల్‌ని వారిద్దరితో పోల్చద్దు. అలాంటిదేమీ లేదు. నేను టీవీ యాక్టర్‌ని కాను. నేను సినిమాల్లో నటించడానికి వచ్చాను. రాహుల్ కూడా సింగర్, డ్యాన్సర్. నేను చేసిన ‘ఒక చిన్న విరామం’ సినిమాలో రాహుల్‌ని ఓ పాటలో యాక్ట్ చేయమని అడిగాం. కానీ అతనికి ఖాళీ దొరకలేదు. మేం మా రిలేషన్‌ను ప్రొఫెషనల్‌గానే ఉంచాలని అనుకుంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు’’ అని వెల్లడించారు పునర్నవి. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2uUykGn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....