Sunday, 16 February 2020

వరుణ్ తేజ్‌కి ఇదే నా ఛాలెంజ్: హరీష్ శంకర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈరోజు తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటి కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. టీఆర్‌ఎస్ నేతలు క్రాంతి కిరణ్, సంతోష్ కుమార్‌లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. READ ALSO: ‘‘కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా నా బాల్య మిత్రుడు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటాను. హైదరాబాద్‌లోని ప్రతీ ఒక్కరూ హరిత హారంను సపోర్ట్ చేయాలి. వర్షపాతానికి, పర్యావరణ సంక్షేమానికి ఇది ఎంత మంచి పథకమో మీకు తెలుసు. సాధారణంగా మాకు సినిమా ఫంక్షన్లకు వెళ్లడం అలవాటు. కానీ ఇలా సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. కేసీఆర్‌కు హ్యాపీ బర్త్‌డే. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రామ్‌కు నేను హీరో వరుణ్ తేజ్‌ను నామినేట్ చేస్తున్నాను. వరుణ్.. ఈ ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉండు’’ అని తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Htzlb3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....