Wednesday, 19 February 2020

మంచు లక్ష్మి కూతురు.. శివరాత్రి పాట ఇరగదీసిందిగా..!

మంచు కుటుంబం నుంచి ఫ్యాన్స్‌కి స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవరాలు, గారాలపట్టి విద్య నిర్వాణ మంచు శివరాత్రి రోజున పాట పాడి అలరించబోతోంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘శివరాత్రి రోజున ఓ సర్‌ప్రైజ్ రాబోతోంది. మా కలను నిజం చేసినందుకు మనోజ్‌కు ధన్యవాదాలు. నా కూతురు నిర్వాణ అన్నీ శ్రద్ధగా నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాలో స్ఫూర్తినింపుతున్నావ్’ అని పేర్కొన్నారు. మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ.. ‘‘నా బుజ్జి తల్లి, నా ప్రాణం, నా సర్వస్వం నా విద్యా నిర్వాణ బంగారం ఆ పరమేశ్వరుడికి అందించే ఈ చిరు కానుక. ఈ శివరాత్రిర మన ఎంఎం ఆర్ట్స్ ద్వారా చూసి ఆనందించండి’’ అని తెలిపారు. ఇప్పటికే మంచు లక్ష్మి తన కూతురితో కలిసి ‘చిట్టి చిలకమ్మ’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. పిల్లల పట్ల తల్లులు ఎలా ఉండాలి, వారిని చిన్నప్పటి నుంచే అర్థంచేసుకునే విధంగా ఎలా పెంచాలి వంటి అంశాలను తీసుకుని వీడియోలు చేస్తున్నారు. ఈ ఛానెల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు మంచు లక్ష్మి మూడు ఎపిసోడ్స్ చేసారు. READ ALSO: READ ALSo:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38HDB2y

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....