నేచురల్ స్టార్ వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్‌తో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘అ’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు జాతీయ అవార్డులు కూడా దక్కించుకుంది. ఇప్పుడు అదే ధీమాతో నాని మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో పాపులర్ అయిన కుర్ర హీరో విశ్వక్ సేన్‌తో నాని ఓ సినిమా తీయబోతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ గాసిప్స్‌ని నిజం చేస్తూ క్రిస్మస్ సందర్భంగా నాని టైటిల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. సినిమాకు ‘హిట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పేరులో ఉన్న హిట్టు, బాక్సాఫీస్ దగ్గర కూడా వినిపించే టాక్‌లోనూ ఉంటుందో లేదో వేచి చూడాలి. ఇందులో విశ్వక్ సేన్ విక్రమ్ రుద్రరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆయనే హ్యాండిల్ చేయగలడని నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. న్యూఇయర్ రోజున ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను అభిమానులతో షేర్ చేసుకోబోతున్నట్లు నాని ప్రకటించారు. సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా రుహానీ శర్మ నటించనున్నారు. పోస్టర్‌లో విశ్వక్ సేన్ లుక్‌ని చూస్తుంటే మరోసారి ఈ సినిమాతో తన విశ్వరూపాన్ని ప్రదర్శించేలా ఉన్నాడు. మరోపక్క నాని ‘v’ సినిమాతో బిజీగా ఉన్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నారు. నివేదా థామస్, అదితి రావు హైదరి కథానాయికలుగా నటిస్తు్న్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QhmAV1
No comments:
Post a Comment