ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు నాని. తనకు నిన్ను కోరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. మంగళవారం ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. 2020లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించిన చిత్రయూనిట్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో నానికి జోడిగా రీతూవర్మ నటించనుంది. మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. Also Read: ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేసిన ఇటీవల జరిగిన దిశ హత్యోదతం నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎలాంటి హడావిడి లేకుండా సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. ఈ సినిమా ఆరుగురు అన్నదమ్ముల కథతో తెరకెక్కనుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమాలో నాని నిక్ నేమ్ టక్ జగదీష్ అని అదే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇటీవల గ్యాంగ్ లీడర్ సినిమాతో పరవాలేదనిపించిన నాని, ప్రస్తుతం వి సినిమాలో సరికొత్తగా అలరించనున్నాడు. ఈ సినిమాలో నాని తొలిసారిగా నెగెటివ్ రోల్‌లో కనిపిస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావ్ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34K5xRw
No comments:
Post a Comment