Tuesday, 22 June 2021

Payal Rajput : కొత్త చిత్రంతో హీరో జోరు.. పాయల్‌తో ఆది రొమాన్స్

ల‌వ్‌లీ హీరో సాయికుమార్ సక్సెస్ కోసం కొత్త కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. చివరగా శశి అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకురెడీ అవుతున్నారు. ఆది హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌కత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `కిరాత‌క‌` అనే ప‌వ‌ర్‌ఫుల్‌ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న‌ ఈ మూవీలో ఆది సాయికుమార్ స‌ర‌స‌న హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్‌పూత్ న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ.. ఆది హీరోగా నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చుట్టాల‌బ్బాయి సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించింది. మరోసారి మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో అద్భుత‌మైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌య్యిందని అన్నారు. ఆది స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై నాగం తిరుపతిరెడ్డి గారు అన్‌కాంప్ర‌మైజ్‌డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం, అలాగే రామ్‌రెడ్డి విజువ‌ల్స్ త‌ప్ప‌కుండా సినిమాకి ప్ల‌స్ అవుతాయని దర్శకుడు అన్నారు. చిత్ర‌ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. మా విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ఆది సాయికుమార్ , ఎం. వీర‌భ‌ద్రం కాంబినేష‌న్‌లో `కిరాత‌క‌`అనే చిత్రం రూపొందిస్తున్నాం. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ వీర‌భ‌ద్రం గారు చెప్పిన క‌థ బాగా న‌చ్చింది. అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోతున్నామని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3d1UxoK

No comments:

Post a Comment

'Mark Mobius Saw India's Rise Before Other Investors'

'Mark Mobius's life was dedicated to investing.' from rediff Top Interviews https://ift.tt/V6zhcgU