Saturday, 19 June 2021

Karthika Deepam: నేను మహేష్ బాబు ఫ్యాన్‌ని.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ: డాక్టర్ బాబు ఇంటర్వ్యూ

సినిమాల్లో రికార్డుల్ని లెక్కకట్టాలంటే బాహుబలి.. నాన్ బాహుబలి అని ఎలాగైతే అంటుంటారో.. సీరియల్స్‌లో కార్తీకదీపం.. నాన్ కార్తీకదీపం అనేట్టుగా తయారైంది పరిస్థితి. ఇండియాలోనే హయ్యెస్ట్ టీఆర్ఫీ రేటింగ్ సాధిస్తూ అనేక సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాలకి బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. అది ఎంతలా అంటే ఓ వంద సినిమాలు చేసిన హీరోకి వచ్చినంత పేరు ఈ డాక్టర్ బాబుకు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. సినిమా హీరోలనైనా గుర్తుపడతారో లేదో తెలియదు కానీ.. ఈ డాక్టర్ బాబుకి అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి బామ్మల వరకూ ఫ్యాన్సే. ఎందుకంటే ప్రతి ఇంటిలోనూ ‘కార్తీకదీపం’ సీరియల్‌ని వీక్షించేవాళ్లు ఉన్నారు కాబట్టి. అయితే బుల్లితెరపై స్టార్ హీరో అనిపించుకున్న డాక్టర్ బాబు.. త్వరలో వెండితెరపై అడుగు పెట్టబోతున్నారు. స్వయంగా ఆయనే టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. మాట్లాడుతూ.. ‘బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వెళ్లడం అనేది మన చేతుల్లో లేదు. సినిమాల్లో చేయాలనే ఉంది. కార్తీకదీపం సీరియల్ వచ్చినట్టే.. సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పుకుండా చేస్తా. కొన్ని క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ.. నాకు సరిపోయే పాత్రను ఎంపిక చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. సినిమాల్లో అయితే చేయాలనే ఉంది. అయితే ఎలాంటి పాత్రల్ని ఎంచుకోవాలనే డైలామాలో ఉన్నా.. ఇప్పటి వరకూ నన్ను సీరియల్స్‌లో ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరోగానే చూశారు. ఇక సినిమాలంటే.. దానికి నేను ఫిట్ అవుతానా? లేదా? ఆలోచించి అడుగులేస్తున్నారు. చేస్తే పలానా పాత్రే చేయాలి.. ఫైట్స్ చేయాలి.. డాన్స్ చేయాలని లేదు. నా దృష్టిలో సబ్జెక్ట్ హీరో.. ఆ సబ్జెక్ట్‌లో నేనో పాత్రను మాత్రమే. అది సినిమా అయినా సీరియల్ అయినా. బిగ్ స్క్రీన్‌పై నాకు అంటే చాలా ఇష్టం.. వెంకటేష్ గారి సినిమాలు బాగా చూస్తా. చిరంజీవి గారు ఆల్ టైం ఫేవరేట్. హీరోయిన్స్ అయితే చాలామంది ఉన్నారు.. సీజనల్‌గా మారిపోతుంటారు’ అని చెప్పుకొచ్చారు నిరుపమ్ పరిటాల. ఆయన చెప్పిన మరికొన్ని ముచ్చట్లు ఈ కింది లింక్‌లో చూడొచ్చు


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35zsLf1

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....