Sunday, 20 June 2021

పవన్ కళ్యాణ్‌ వ్యక్తిత్వం అలాంటిది.. ఆయన్ను చూడగానే! యంగ్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్‌లో క్రేజ్ ఏంటనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ తెలుసు. మెగా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొన్నేళ్లలోనే చిరంజీవి రేంజ్ పాపులారిటీ తెచ్చుకొని అన్నయ్యకు తగిన తమ్ముడుగా సత్తా చాటారు పవన్. కేవలం ప్రేక్షకులే కాదు.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్స్ కూడా పవన్ అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. తమ ఫేవరేట్ హీరో, బెస్ట్ పర్సనాలిటీ పవన్ కళ్యాణ్ అని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్ పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ మీడియా ఛానెల్‌తో లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజన.. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా సంగతులు, ఫేవరేట్ హీరోలు తదితర సంగతులపై ఓపెన్ అయింది. పవన్ కళ్యాణ్‌ అంటే ప్రాణం అని చెబుతూ ఆయనపై ఉన్న అపారమైన ప్రేమను బయటపెట్టింది. ఆయనతో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించానని, నేరుగా ఆయన్ను చూడగానే గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది. పవన్‌తో కలిసి పనిచేశాక ఆయన మీదున్న ప్రేమ మరింత పెరిగిందని సంజన తెలిపింది. ఇక హిందీ సినిమాల్లో షారుక్ ఖాన్ అంటే ఇష్టం అని, తన తండ్రి తర్వాత తాను మరో మగాడిని ప్రేమించాను అంటే అది షారుక్ ఖాన్ అని చెప్పింది. ఆ ఒక్క ఫీలింగ్ తెలుగులో పవన్ కళ్యాణ్‌ని చూస్తే మాత్రమే అనిపిస్తుందని తెలిపింది. ఆడవాళ్లను పవన్ గౌరవించే పద్ధతి తనను ఇంకా ఇంప్రెస్ చేసిందని చెప్పింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో చిరంజీవి చేసిన సేవలను, ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడాన్ని కొనియాడుతూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది. 2005 సంవత్సరంలో 'సోగ్గాడు' అనే సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన సంజనా గల్రాని.. 'బుజ్జిగాడు' సినిమాతో ఫేమస్ అయింది. ఆ తర్వాత , సర్దార్ గబ్బర్ సింగ్, అవును2, 2 కంట్రీస్ లాంటి సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి తిరిగి విడుదల కావడంతో సంజన పేరు దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xBttoi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....