Tuesday, 22 June 2021

రెట్టింపైన హాట్ డోస్.. అలా కనిపించి షాకిచ్చిన శ్రీయ! హీరోయిన్ అందాలపై ఓ రేంజ్ కామెంట్స్

సోషల్ మీడియా ఖాతాలు ఉన్నదే అందాలు ఆరబోసి ఫాలోయింగ్ పెంచుకోవడానికి అన్నట్లుగా ఉంది నేటితరం హీరోయిన్ల తీరు. అయితే ఇందులో సీనియర్ హీరోయిన్ కూడా ఉండటం గమనార్హం. ఒకానొక సమయంలో వెండితెరను తన అందాలతో తడిపేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఆన్‌లైన్ వేదికలను వేడెక్కించే పని పెట్టుకుంది. ఆమె షేర్ చేస్తున్న హాట్ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఫొటోతో కుర్రకారు మతి పోగొట్టింది ఈ హాట్ బ్యూటీ. పెళ్లి చేసుకున్నాక హాట్ డోస్ మరింత పెంచేసింది శ్రీయ. భర్తతో రొమాంటిక్ టూర్స్ వేస్తూ ఆయా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట సంచలనంగా మారుతోంది. 38 ఏళ్ల శ్రీయ అందాలు చూసి వావ్! అంటున్నారు నెటిజన్లు. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే విదేశీయుడు ఆండ్రూతో డేటింగ్ చేయడం డేటింగ్ చేసి 2018లో అతడిని పెళ్లాడింది శ్రీయ. ఇక అప్పటినుంచి నిత్యం ఆన్ లైన్ వేదికలపై హల్చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరో హాట్ పిక్ పోస్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది శ్రీయ. 'ఇంతకుమించిన ఆనందం ఇంకెక్కడా దొరకదు' అని ట్యాగ్ చేస్తూ తాను నీటిలో ఎంజాయ్ చేస్తున్న పిక్ షేర్ చేసింది. బికినీలో శ్రీయ అందాలు అదరహో అనిపిస్తుండటంతో ఈ పిక్ వెంటనే వైరల్ అయింది. ఇక ఆమె అందాలను వర్ణిస్తూ నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. 2001లో వచ్చిన ‘ఇష్టం' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీయ.. కెరీర్ ఆరంభంలోనే సూపర్ డూపర్ హిట్స్ అందుకొని టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌‌గా మారింది. తన సుదీర్ఘ కెరీర్‌లో రెండు తరాల అగ్ర హీరోలతో రొమాన్స్ చేసి నేటికీ వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె RRR సినిమాలో నటిస్తోంది. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో శ్రీయ రోల్ కీలకం కానుందట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ul8O9s

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....