Monday, 21 June 2021

వైన్ తాగాక అలా ఫీలవుతా?.. అసలు విషయం చెప్పిన సురేఖా వాణి కూతురు

ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. తల్లీకూతుళ్లు చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. ఇక ఇద్దరూ కలిసి చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. చీరకట్టుతో ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలా సురేఖా వాణికి తగ్గ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే సుప్రిత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండటంతో అంతే స్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ట్రోలర్లపై సుప్రితపై మండిపడే తీరు కూడా వివాదాలకు దారి తీస్తుంటారు. మొన్నీ మధ్యే సుప్రిత లైవ్‌లో ఓ నెటిజన్‌కు వార్నింగ్ ఇచ్చారు. మీరు తాగుతారు కదా? అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడిన నెటిజన్ మీద సుప్రిత అంత ఎత్తున లేచారు. నువ్ తాగి ఉంటావ్ రా.. నీ లాంటి వాటిని నడి రోడ్డు మీద బట్టలిప్పి నిల్చోబెట్టాలిరా అంటూ పచ్చి బూతులతో సుప్రిత రెచ్చిపోయారు. అలా సుప్రిత నిత్యం ఏదో టాపిక్ మీద స్పందించడం అది కాస్తా నెట్టింట్లో వైరల్ అవ్వడం జరుగుతుంటుంది. తాజాగా సుప్రిత తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేశారు. తన గురించి ఎవరు ఏమేం అనుకుంటున్నారో చెప్పండని సుప్రిత ఓ పోస్ట్ పెట్టారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు సుప్రిత వ్యక్తిత్వం మీద ప్రశ్నలు అడిగితే.. ఇంకొందరు మాత్రం పర్సనల్ విషయాలపైనే దృష్టి పెట్టేశారు. ఓ నెటిజన్ మాత్రం ఏకంగా తన తాగుడు అలవాటు మీదే ప్రశ్నను సంధించాడు. మీరు ఓ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా? అని తన అభిప్రాయాన్ని నెటిజన్ అడిగేశారు. దానికి ఏ మాత్రం తడబడకుండా సుప్రిత సమాధానం ఇచ్చేశారు. వైన్ బాటిల్ తాగాక అలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో అని చెప్పుకొచ్చారు. మొత్తానికి తనకు వైన్ తాగడం అలవాటేనని ఇలా ప్రత్యక్షంగా సుప్రిత చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zNZQBM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....