Tuesday, 22 June 2021

అన్నింటిని దాచి అదొక్కటి మాత్రం చూపించింది.. చాందినీ చౌదరి మామూల్ది కాదు!

కలర్ ఫోటోతో ఒక్క సారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. అంతకు ముందు యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి ఆదరణను దక్కించుకున్నారు. కానీ వెండితెరపై మాత్రం అంత త్వరగా గుర్తింపు రాలేదు. ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా బోల్తా కొట్టాయి. హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ వర్కవుట్ అవ్వలేదు. అలా చివరకు సక్సెస్ కోసం ఎదురుచూసిన చాందినీ చౌదరికి అసలు సిసలు విజయం దక్కింది. గత ఏడాది ఓటీటీలో వచ్చిన కలర్ ఫోటో సినిమాతో చాందినీ చౌదరికీ సరైన గుర్తింపు వచ్చింది. అందం, అభినయంలో చాందినీ చౌదరి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ చాందినీ చౌదరికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య వరుస పోస్ట్‌లో చాందినీ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా చాందినీ తన చిన్న నాటి గుర్తులను బయటపెట్టేశారు. చిన్నప్పుడు స్కూల్‌లో ఉన్న సమయంలో స్లామ్ బుక్స్ అంటూ రచ్చ చేసి ఉంటారు. మన ఇష్టాయిష్టాలను అందులో రాస్తాం. అలా చిన్నప్పుడు చాందినీ చౌదరి స్లామ్ బుక్‌లో రాసినవన్నీ బయటకు వచ్చేశాయి. తాజాగా తన ఫ్రెండ్ ఒకరు తాను రాసిన స్లామ్ బుక్ ఫోటోను షేర్ చేశారట. ఆ విషయాన్ని చాందినీ చౌదరి చెప్పుకొచ్చారు. అందులో అన్ని విషయాలను దాచి పెట్టిన చాందినీ చౌదరి ఒకే విషయాన్ని అందరికీ చూపించారు. పెద్దయ్యాక ఏం అవ్వాలని కలలు కంటున్నావ్ అనే కాలమ్ వద్ద.. నటిని కావాలని అనుకుంటున్నట్టు చాందినీ పేర్కొన్నారు. అలా చిన్నప్పుడే నటి అవ్వాలని చాందినీ ఫిక్స్ అయ్యారట. అది ఇప్పుడు నెరవేరిందని చెప్పుకొచ్చారు. అలా చిన్నప్పటి స్లామ్ బుక్‌ను ఇప్పుడు చూస్తే ఎంతో సంతోషంగా ఉందని చాందినీ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dk9QcL

No comments:

Post a Comment

'God Does Not Make People Like Mohsina Kidwai Now'

'She was not a yes person. She would tell the truth and her feelings to Indira Gandhi, and Indira Gandhi would value her opinion. The sa...