Tuesday, 1 June 2021

అదితి రావు హైదరి మాజీ భర్త పోస్ట్ వైరల్.. అలా పడుకొని సెల్ఫీ పోజివ్వడంతో హీరోయిన్ క్రేజీ రియాక్షన్

సాధారణ ప్రజలందరి లాగే సినీ తారలకు పర్సనల్ లైఫ్‌లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ గ్లామర్ ప్రపంచంలో విహరిస్తుంటారు కాబట్టి అవేవీ బయటకు పెద్దగా కనిపించవు. తోటి నటులతో డేటింగ్స్, బ్రేకప్స్, పెళ్లి- విడాకులు ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఇలానే యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ జీవితంలో కూడా చాలామందికి తెలియని కొన్ని నిజాలు ఉన్నాయి. గత పన్నెండేళ్ల క్రిందటే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కొన్ని కారణాలతో భర్తకు విడాకులు ఇచ్చేసి ఒంటరి జీవితం గడుపుతోంది. తన అందచందాలతో వెండితెరను సమ్మోహన పరిచిన అదితీరావు హైదరీ హైదరాబాదులోనే జన్మించింది. 2006 సంవత్సరం లోనే లోనే సినీ గడప తొక్కి.. మోడల్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పర్చుకున్న ఈమెకు తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. కాకపోతే సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకుంది. అయితే ఆమె పర్సనల్ లైఫ్‌లో మాత్రం చాలా బ్యాడ్ మూమెంట్స్ ఉన్నాయి. నటుడు సత్యదీప్ మిశ్రాను 2009లో వివాహం చేసుకున్న అదితి.. ఏమైందో తెలియదు గానీ 2013లో అతనితో విడాకులు తీసుకుంది. అయితే విడాకుల అనంతరం కూడా ఆయనతో ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తోంది అదితీరావు హైదరీ. ఈ నేపథ్యంలో తన మాజీ భర్త తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పిక్ చూసి క్రేజీగా కామెంట్ వదిలింది ఈ ముద్దుగుమ్మ. తన పెట్ డాగ్‌తో పడుకొని ఎంజాయ్ చేస్తూ కలిసి దిగిన ఓ సెల్ఫీ పిక్ షేర్ చేశాడు సత్యదీప్ మిశ్రా. ఇది చూసిన అదితి కాస్త క్రేజీగా 'ఉఫ్' అంటూ సింగిల్ లైన్ కామెంట్ చేసింది. దీంతో ఈ ఇష్యూ వైరల్ అయింది. ప్రస్తుతం సత్యదీప్ తన సహనటి మసాబా గుప్తాతో రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక భర్తతో విడాకుల తర్వాత సోలో లైఫ్ లీడ్ చేస్తున్న అదితి.. ప్రెజెంట్ శర్వానంద్ హీరోగా రూపొందుతున్న 'మహా సముద్రం' సినిమాలో నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pjZrm4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....