Tuesday, 1 June 2021

సినిమా రౌండప్: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. దూసుకొస్తున్న రష్మీ రాకెట్‌.. షకీలా ఎంటర్

కరోనా కష్టం.. షకీలా సాయం కరోనా కష్టకాలంలో ఎందరో సినీ సెలబ్రిటీలు అవసరమున్న వారికి తమవంతు సాయాన్ని అందిస్తున్నారు. తాజాగా శృంగార తార షకీలా కూడా తనవంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆమె ఫుడ్ పాకెట్స్ అందిస్తోంది. రష్మీ రాకెట్‌ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ 'రష్మీ రాకెట్‌' విడుదలకు రెడీ అయింది. అకర్ష్‌ ఖురానా దర్శకత్వంలో తాప్సి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీ వేదికపై రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమా విడుదల కోసం బీటౌన్‌ పబ్లిక్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోసారి అలా ఓ వైపు హీరోగా రాణిస్తూనే 'మీకు మాత్రమే చెప్తా' అంటూ నిర్మాత అవతారమెత్తిన విజయ్ దేవరకొండ.. మరో సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' నిర్మిస్తున్న ఆయన మూడో సినిమా కూడా ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ముహూర్తం పెట్టేసిన మోహన్ బాబు డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. మోహన్ బాబు లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ జూన్ 4న రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఇస్మార్ట్ హీరో రామ్ గ్రీన్ సిగ్నల్ తమిళ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఇస్మార్ట్ హీరో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మురగదాస్‌ తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌లో భారీ బడ్జెట్‌ కేటాయించి ఈ మూవీ రూపొందించనున్నారని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cb9VPd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....