తమిళ హీరోలు తెలుగు తెరపై కూడా సత్తా చాటుతున్నారు. కథలో బలమున్న సినిమాలతో బరిలోకి దిగి క్రమంగా టాలీవుడ్ మార్కెట్ పెంచేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే 'ఖైదీ' సినిమాతో హిట్ కొట్టిన ఇప్పుడు 'సుల్తాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న విడుదలైంది. మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా రిలీజైన ఈ చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్ట్రల్లోని మాస్ సెంటర్స్‌లో మంచి గ్రోత్ కనబర్చడమే గాక, ఈ సినిమాతో పాటు విడుదలైన 'వైల్డ్ డాగ్'కి దాదాపు ఈక్వల్‌గా మొదటి రోజు కలెక్షన్స్ వచ్చాయి. కోటి రూపాయల వరకు కలెక్షన్స్ వస్తాయని ఉహించగా అంతకుమించి అన్నట్లుగా ఏకంగా 1.17 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఏరియాల వారిగా రిపోర్ట్ చూస్తే.. నైజాం- 42 లక్షలు సీడెడ్- 18 లక్షలు ఉత్తరాంధ్ర- 14 లక్షలు ఈస్ట్ గోదావరి- 10 లక్షలు వెస్ట్ గోదావరి- 7.3 లక్షలు గుంటూరు- 10 లక్షలు కృష్ణా- 11.5 లక్షలు నెల్లూరు- 5.2 లక్షలు మొత్తంగా చూస్తే 2.25 కోట్ల గ్రాస్, 1.17 కోట్ల షేర్ వసూలైంది. 6.5 కోట్ల రూపాయల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 5.33 కోట్ల షేర్ రాబడితే సేఫ్ జోన్ లోకి వెళుతుంది. కాగా కార్తీ కెరీర్‌లో తొలి రోజు ఎక్కువ షేర్ వసూలు చేసిన రెండో సినిమాగా ఈ మూవీ నిలిచింది. గతంలో కార్తీ హీరోగా వచ్చిన 'కాశ్మోరా'కు తొలి రోజే 2.25 కోట్లు వచ్చాయి. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందిన 'సుల్తాన్' చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్‌ఆర్ ప్రకాష్ బాబు, యస్‌ఆర్ ప్రభు నిర్మించారు. హీరోయిన్‌గా నటించింది. ఆమెకిదే తొలి తమిళ సినిమా కావడం విశేషం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sNVG9k
No comments:
Post a Comment