సురేఖ వాణి.. తెలుగు సినిమా ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితురాలు. వదినగా, తల్లిగా, సోదరిగా, అత్తగా ఇలా ఎటువంటి పాత్ర అయినా అందులో ఒదిగిపోయి నటించడం సురేఖ వాణి ప్రత్యేకత. ఇప్పటికే ఆమె తన విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది. హాస్యభరిత పాత్రల్లోనే కాక.. ఎమోషనల్ పాత్రల్లోనూ ఆమె అద్భుతంగా నటిస్తుంది. తెరపై సాంప్రదాయ పాత్రల్లోనే కనిపించే సురేఖ.. బయట కూడా అంతే ట్రెడిషనల్‌గా ఉంటుంది. అయితే పలు సందర్భాల్లో తన కుమార్తె సుప్రియతో కలిసి పొట్టి దుస్తులు ధరించి.. డ్యాన్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేసిన సురేఖ.. నెటిజన్ల నుంచి విమర్శలు కూడా ఎదురుకుంది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు కారణం ఆమె పెట్టిన లేటెస్ట్ పోస్ట్. తాను ప్రేమలో పడినట్లు సురేఖ వాణి పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే తాను ప్రేమలో పడింది ఓ వ్యక్తితో కాదు.. తన కొత్త నెక్లెస్‌తో. ‘ఈ నెక్లెస్‌తో ప్రేమలో పడ్డాను’ అంటూ ఆ నెక్లెస్ ధరించిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సురేఖ వాణి పంచుకుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wnN8YO
No comments:
Post a Comment