పవర్ స్టార్ ‘’ చిత్రం భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందు వస్తుంది. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో ఈ సినిమా సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తూ మిలియన్ల వ్యూస్ రాబట్టి.. టాప్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ తరుణంలో ట్రైలర్ చూసి సినిమా భవిష్యత్ ఏంటి? ఎలాంటి హిట్ సాధించబోతుంది? అసలు వకీల్ సాబ్‌లో విషయం ఉందా? లేదా అన్నదానిపై విశ్లేషణ అందించారు సీనియర్ రైటర్, డైరెక్టర్ పరిచూరి గోపాలకృష్ణ. పాఠాలు ద్వారా సినిమాలపైన ఇండస్ట్రీపైన తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్న పరుచూరి తాజాగా వకీల్ సాబ్ చిత్రం గురించి విశ్లేషణ అందించారు. అన్నం అంతా ఉడికిందో లేదో చూడాలంటే మొత్తం చూడాల్సిన పనిలేదు.. రెండు మూడు మెతుకులు చేస్తే పసిపోతుంది. వకీల్ సాబ్ ట్రైలర్ చూశాక నాకు ఇదే అనిపించింది. ఇంటి ముందు ముగ్గు చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పేయొచ్చని అంటారు.. సినిమా సామెత ఏంటంటే.. ట్రైలర్ చూస్తే సినిమా దమ్ము తెలిపోద్ది. వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ చూడగానే నాకు నాకు ఇదే అనిపించింది. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి మీకు అలా నచ్చేస్తుందిలే గురువుగారు అని మీరు అనుకోవచ్చు కానీ.. మన దగ్గర రెండున్నర గంటల సినిమా ఉన్నప్పుడు దాన్ని ట్రైలర్‌లో చూపించడం అనేది చిన్న విషయం కాదు. కథ రివీల్ చేయకూడదు.. అదే సందర్భంలో ఓస్ ఇంతేనా అనేట్టుగా ఉండకూడదు. హీరో గెటప్.. అతని నేపథ్యం ఏంటన్నది కూడా వకీల్ సాబ్ ట్రైలర్‌లో చూపించలేదు. కాబట్టి ఖచ్చితంగా అతనికి మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అర్థమైంది. ఒక బలహీనుడు తిరగబడితే.. బలహీనుడ్ని పరిగెట్టించగలడు.. ఒక బలహీనురాలిపై ఒక బలవంతుడు చేస్తున్న కుట్రనుంచి కాపాడటానికి ఒక సింహం వచ్చింది.. ఆ సింహమే పవన్ కళ్యాణ్. సింహం వచ్చిన తరువాత కథ అయిపోతుంది కదా.. ఇంకేం ఉందిలే అనుకోవచ్చు. కానీ అతనికి ఎదురుగా మరొక సింహాన్ని పెట్టారు. అతనే ప్రకాష్ రాజ్. రెండు సింహాలు తలపడితే జనం చాలా ఆసక్తిగా చూస్తారు. మిగతా పాత్రలు ఎవరూ తెలియదు కానీ.. ఈ సినిమాలో లాయర్ నంద.. ఓ ఆడపిల్లను కోర్టులో నువ్ కన్యవేనా అని అడగడం అనేది.. ఆడపిల్ల గుండె గొంతులోకి వచ్చేస్తుంది ఆ మాటకి. ఎందుకంటే.. ఆమెను నువ్ గదిలో రహస్యంగా ప్రశ్నించడం లేదు.. కొన్ని వందల మంది.. గ్యాలరీలో కూర్చుని ఉంటే వాళ్ల ముందు నువ్ కన్యవేనా అని అడగడంతో ట్రైలర్ స్టార్ చేశారు. చివర్లో పవన్ కళ్యాణ్ కూడా బలవంతుడిగా ఉన్న ఆ అబ్బాయి అదే ప్రశ్న వేశాడు.. నువ్వ్ వర్జిన్‌వా అని. నందా.. అబ్జెక్షన్ అని లేస్తున్నాడు.. మీరు అమ్మాయిని అడగొచ్చు.. అబ్బాయిని అడగకూడదని అని పవన్ కళ్యాణ్ అడుగుతుంటే రెస్పాన్స్ ఎలా ఉంటుందో రేపు థియేటర్స్‌లో చూడొచ్చు. నువ్ వర్జినిటీ అనేది అమ్మాయిలకే చూస్తారా?? అబ్బాయిలకు చూడరా?? అంటే కన్యాదానం చేసేటప్పుడు నా కూతురు కన్య అని చెప్తున్నాం తప్పితే.. పురుషుడు ఎవరితో తిరిగి వచ్చేసినా పర్లేదా?? అది చాలా అన్యాయం కదా.. దాన్నే ఈ ట్రైలర్‌లో చూపించారు. బెయిల్ వస్తుంది కదా.. అని యువతి అమాయకంగా అడుగుతుంటే.. ఎవరు చెప్పార? అన్నప్పుడు హీరోని ఓ ఫైట్ సీన్‌తో ఇంట్రడ్యూస్ చేస్తారని అనుకుంటాం.. కానీ వకీల్ సాబ్ సామాన్లు మధ్య కూర్చుని పుస్తకం చదువుతున్న విజువల్ చూపించారు. ఆ తరువాత కోర్టు వేసుకునే సీన్ చూపించారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కథ ఏంటో అర్థం అయిపోతుందని భయపడొద్దు. కథ అర్థం అయినా.. ఎలా సాధిస్తారు అనే ఉత్కంఠను కథలో తీసుకుని రాగలిగితే.. అది అద్భుతంగా ఆడుతుంది. దానికి ఉదాహరణే వకీల్ సాబ్. కేసు ఓడిపోబోతున్నాడు.. ప్రపంచంలో ఏ లాయర్ కూడా గెలవలేడనే చిన్న ముక్కని వదిలారు ట్రైలర్‌లో. వకీల్ సాబ్ అనే టైటిల్ పెట్టడంతోనే మంచి అందం వచ్చింది సినిమాకి. లాయర్ బ్యాడ్రాప్‌లో సినిమా అన్నప్పుడు.. లాయర్ విశ్వనాథం.. లాయర్ సుహాసిని ఇలా క్యారెక్టర్ పేర్లతో సినిమా టైటిల్ పెట్టేవాళ్లం. పవర్ స్టార్ పేరుకి కూడా లాయర్‌ని యాడ్ చేసి పెట్టొచ్చు. కానీ చాలా చక్కగా వకీల్ సాబ్ అని మాత్రమే పెట్టించుకున్నాడు. ఫ్యామిలీ డ్రామా.. యాక్షన్ డ్రామా.. లవ్ డ్రామాల మాదిరిగా.. ఇది కోర్ట్ రూం డ్రామా.. కోర్టు రూం డ్రామా అంటే సాధ్యమైనంత వరకూ బోర్ కొట్టే అతి ప్రమాదకరమైన అంశాలు ఉంటాయి. బోర్ కొట్టకుండా ఉండాలంటే.. ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ కలిగించాల్సిందే. ఈ సినిమాలో అది ఉందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నప్పుడు తన ఒరిజినల్ డిక్షన్‌కి పక్కనే ఉన్నాడని అనిపించింది. చాలా కొత్తగా నటించాడనే అనిపించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తుంది. ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా అద్భుతంగా ఆడబోతుంది.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒక చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నా’ అంటూ వకీల్ సాబ్ ట్రైలర్ చూసి సినిమాకి రివ్యూ ఇచ్చేశారు పరుచూరి గోపాలకృష్ణ.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3duC1F0
No comments:
Post a Comment