ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వెకేషన్ ట్రిప్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయ్యింది మాల్దీవ్స్. బర్త్ డే పార్టీ , ఫ్యామీలీ టూర్, హనీమూన్ ట్రిప్.. ఇలా ఏ సందర్భమైనా సెలబ్రిటీలకు మాత్రమే గుర్తొస్తోంది. భూతల స్వర్గమైన అక్కడి అందమైన ప్రదేశాల్లో స్పెషల్ డేస్ ఎంజాయ్ చేసేస్తున్నారంతా. స్టైలిష్ స్టార్ కూడా అదే చేశారు. ఓ వైపు 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నా కూడా భార్యాపిల్లలతో కలిసి మాల్దీవ్స్ వెళ్లారు బన్నీ. నిన్న (ఏప్రిల్ 3) అల్లు అయాన్ బర్త్ డే సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా ఈ వెకేషన్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డే చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఈ వెకేషన్ ట్రిప్ తాలూకు ఫొటోస్, వీడియోస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి తన అభిమానులకు కిక్కిచ్చారు బన్నీ. కూతురు అర్హతో కలిసి అల్లు అర్జున్ భార్య స్నేహ మాల్దీవ్స్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను బన్నీ పోస్ట్ చేయగా.. అందుకు కురచ దుస్తుల్లో కనిపించి ఆశ్చర్యపర్చింది స్నేహా. నిజానికి అల్లు అర్జున్- స్నేహా దంపతులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ అనే పేరుంది. ఈ ఇద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయంటే చాలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. కాకపోతే ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించే బన్నీ భార్య స్నేహా తాజాగా వీడియోలో మాత్రం కాస్త హాట్ హాట్‌గా కనిపించడం గమనార్హం. ఈ ట్రిప్‌లో భార్యతో బన్నీ ఫుల్లుగా చిల్ అయ్యారని తెలుస్తోంది. అక్కడి బీచ్‌లో స్నేహా బికినీ కూడా వేసి సందడి చేసిందని తెలుస్తోంది. ఇకపోతే అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప' కోసం ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక్కొక్కటిగా విడుదలవుతున్న ఈ సినిమా అప్‌డేట్స్ మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wsjPof
No comments:
Post a Comment