రోజు రోజుకూ కరోనా ఉదృతి పెరుగుతూ పోతోంది. కోవిడ్ బారిన పడుతున్న సినీ ప్రముఖుల లిస్ట్ కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ రెండో దశ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ నివేధా థామస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సహా పలువురు సినీ నటులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. తాజాగా బడా నిర్మాత అల్లు అరవింద్‌కు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు కరోనా సోకిందని వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అరవింద్ రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకున్నారట. అయినా మళ్లీ ఆయనకు కరోనా సోకిందని తెలుస్తుండటం షాకిస్తోంది. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనకు వైద్య పరీక్షలు జరిపించగా కోవిడ్- 19 పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఇక ఆయనతో పాటు స్టార్ డైరెక్టర్ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారని, ప్రస్తుతం వీరిద్దరూ సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్‌కి కారోనా సోకినట్లు అధికారిక సమాచారం లేకపోవడం, మరోవైపు ఆయన కరోనా బారిన పడినట్లు పెద్దఎత్తున వార్తలు వస్తుండటం సినీ వర్గాల్లో గందరగోళ పరిస్థితికి కారణమైంది. చూడాలి మరి సోషల్ మీడియాలో గుప్పుమంటున్న ఈ వార్తలపై ఇప్పటికైనా అల్లు అరవింద్ టీమ్ గానీ, త్రివిక్రమ్ టీమ్ గానీ స్పందిస్తుందా.. లేదా? అనేది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31MHy49
No comments:
Post a Comment