అక్కినేని కోడలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ పెట్టని రోజంటూ ఉండదు. తన భర్త నాగ చైతన్య ఏడాది మొత్తం పెట్టే పోస్ట్‌లు సమంత రెండు మూడు రోజుల్లోనే పెట్టేస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియాను వాడటంలో అంతటి తేడా ఉంటుంది. ఈ విషయంపై ఆ మధ్య సామ్ జామ్ షోలోనూ సమంత వివరణ ఇచ్చారు. సమంత అంటే ఏంటో జనాలకు తెలియాలి.. తన సినిమాల ద్వారా తన పాత్ర స్వభావమే తెలుస్తుంది.. కానీ సమంత అంటే ఏంటో తెలియదు. సోషల్ మీడియాలో ఉండే సమంతే.. ఒరిజినల్ సమంత.. నేను ఇలా ఉంటాను అని తెలియడానికే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను అని సమంత చెప్పుకొచ్చారు. వ్యక్తిగతమైన విషయాలు, వృత్తిపరమైన విషయాలన్నంటిని సమంత తన అభిమానులతో పంచుకుంటారు. సమంత ప్రస్తుతం 'శాకుంతలం' సినిమాతో బిజీగా ఉన్నారు. గుణ టీం వర్క్స్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని గత నెలలో లాంఛనంగా ప్రారంభించారు. శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతోన్నారు. రాణి పాత్ర, ప్రిన్సెస్ క్యారెక్టర్.. మైథలాజికల్ సినిమాలు చేయాలనేది తన కల అని అది ఇన్నాళ్లకు శాకుంతలంతో తీరుతోందని సమంత ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రం కోసం సమంత భారీగానే కష్టపడుతోన్నారు. తాజాగా 'శాకుంతలం' సినిమా గురించి సమంత ఓ అప్డేట్ ఇచ్చారు. అద్భుతమైన సెట్ వేసిన గుణశేఖర్ అక్కడంతా సహజత్వం ఉట్టిపడాలని ఎంతో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సరస్సుల, వనాలు, హంసలు, బాతులు ఇలా అన్నీ కూడా ఎంతో సహజంగా రావాలని సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ మేరకు కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సమంత శాకుంతలం గురించి చెప్పుకొచ్చారు. శాకుంతలం సెట్ నుంచి వచ్చాను.. ఎంతో అలిసిపోయాను.. కానీ ఎంతో సంతోషంగా ఉన్నాను అని సమంత తన ఆనందాన్ని పంచుకున్నారు. అంటే షూటింగ్ అద్భుతంగా వస్తోందని, ఎంతో సంతృప్తి కలుగుతోందని సమంత చెప్పకనే చెప్పేశారు సామ్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dwBKkW
No comments:
Post a Comment