Sunday 21 March 2021

నేను గూగుల్ మ్యాప్ ఫాదర్‌ని కాదు... ఫాదర్స్‌లో రెండు రకాలు: ఎంఎం కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి కుమారుడు శ్రీసింహా కోడూరి తాజా చిత్రం ‘తెల్లవారితే గురువారం’. ‘మత్తువదలరా’ చిత్రంతో నటుడిగా గుర్తింపు సంపాదించిన శ్రీ సింహా ‘తెల్లవారితే గురువారం’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్పణలో వారాహి చ‌ల‌న‌చిత్రం, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ర‌జ‌ని కొర్ర‌పాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈమూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయనతో పాటు రాజమౌళి కూడా పాల్గొని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కీరవాణి తన కొడుకులు శ్రీ సింహా, కాలభైరవలను ఉద్ధేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది మా అబ్బాయి శ్రీసింహా రెండో సినిమా. మొదటి సినిమా అయినా రెండో సినిమా అయినా మూడో సినిమా అయినా.. ప్రతి సినిమాని కూడా ఒక స్టూడెంట్‌లా నేర్చుకుంటూ.. తనని తాను మెరుగు పరుచుకోవాలని చెప్పడానికే కాబోలు.. ‘స్టూడెంట్ నెం.1’ తారక్ ఇక్కడకు వచ్చి బ్లెస్ చేయడం జరుగుతుంది. థాంక్యూ తారక్ సర్ జీ. ఈ సినిమా మంచిగా వస్తే.. నిర్మాత సాయి గారి ఇంటికి వెళ్తా.. మంచి ఉగ్గానీ తిని వస్తా. ఈ సినిమా హీరో సింహాకి, మ్యూజిక్ ఇచ్చిన భైరవలకు ఆల్ ది బెస్ట్. చివరిగా ఒకమాట.. ఫాదర్స్ రెండు రకాలుగా ఉంటారు. ఒకటి గూగుల్ మ్యాప్ ఫాదర్ అంటారు. వాళ్లు ఎలా ఉంటారంటే.. వాళ్లు బయటకు వెళ్తే చాలు నువ్ లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో.. యూటర్న్ తీసుకో అంటూ గైడెన్స్ ఇస్తారు. లైఫ్‌లో కూడా అంతే. కానీ నేను గూగుల్ మ్యాప్ ఫాదర్‌ని కాదు.. నేను ఏంటి అంటే.. ఆల్ ది బెస్ట్ కమ్ బ్యాక్ సేఫ్ అనే ఫాదర్‌ని. క్షేమంగా వెళ్లి లాభంగా రా అనే ఫాదర్‌ని. నా కొడుకులు సింహా, భైరవలు వాళ్ల కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే వాళ్లు ఏం చేయాలో చెప్పాను. ప్రతి సినిమాకి నేను కల్పించుకునే ఉద్దేశం లేదు. అందుకే నేను వాళ్ల సినిమా కథలు కూడా నేను వినను. నాకు ఈ సినిమా కథ కూడా తెలియదు. మీలాగే నేను కూడా థియేటర్‌లో ఈ సినిమా చూడ్డానికి వెయిట్ చేస్తున్నా’ అని చెప్పారు ఎమ్ ఎమ్ కీరవాణి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f1XN5l

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...