Sunday 21 March 2021

Jr Ntr: నా జీవితంలో తొలిసారి ఇబ్బంది పడ్డా.. నాకు తోడున్న ఒకే ఒక కుటుంబం వీళ్లు: ఎన్టీఆర్ ఆవేశం

సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం. కీర‌వాణి కుమారుడు శ్రీసింహా కోడూరి నటించిన రెండో చిత్రం ‘’ విడుదలకు రెడీ అయ్యింది. ‘మత్తు వదలరా’ చిత్రంతో నటుడిగా గుర్తింపు సంపాదించిన శ్రీసింహా.. ‘తెల్లవారితో గురువారం’ అనే వెరైటీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్పణలో వారాహి చ‌ల‌న‌చిత్రం, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ల‌పై ర‌జ‌ని కొర్ర‌పాటి, ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈమూవీ ప్రచారకార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళితో పాటు యంగ్ టైగర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు.. రెండే రెండు ముక్కలు మాట్లాడతాను. బేసిక్‌గా నేను మాట్లాడటానికి ఎక్కువ ఇబ్బంది పడను.. కానీ నా జీవితంలో మొట్టమొదటి సారిగా ఈ స్టేజ్‌పై ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే.. ప్రేక్షకుల ఆనందం నాకు తెలుసు.. మీరు అరిస్తే మాకు కిక్ వస్తుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఓపిక పట్టండి. టెన్షన్‌లో ఉన్నాను. వీళ్లు తెల్లవారితో గురువారం అంటున్నారు కానీ.. నాకు మాత్రం నాలుగు రోజుల నుంచి తెల్లవారితే ఆదివారం వచ్చేస్తుందని టెన్షన్‌లో ఉన్నాను ఎందుకు అంటే.. చాలా తక్కువ సార్లు నేను ఇబ్బంది పడుతుంటా. కానీ అది పైకి కనిపించకుండా కవర్ చేసేస్తుంటా. బహుషా ఇది మొట్ట మొదటి సారి అనుకుంటా.. రేప్పొద్దున్న అభయ్ కానీ.. భార్గవ్ కానీవ్వండి.. ఏదైనా సాధిస్తే వాళ్ల గురించి నేను రెండు ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఇబ్బందిగా బ్లాంక్‌గా.. కొడుకులు విజయం సాధిస్తే తల్లిదండ్రులు ఎలాగైతే సైలెంట్ అయిపోతారో.. నా తమ్ముళ్లు సింహా భైరవ (కీరవాణి కొడుకులు) సాధించిన విజయం స్థానం గురించి మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు. పదాలు సమకూరడం లేదు. ఈరోజు వీళ్లని చూసి నేను ఎంత ఆనందపడుతున్నానో.. రేపటి రోజున భార్గవ్, అభయ్ (ఎన్టీఆర్ కొడుకులు)లను చూసి ఇంతే ఆనంద పడతానేమో. నన్ను ఇక్కడ ముఖ్య అతిథి అనో.. ఇంకేదో అని అనవసరమైన మాటలు ఏవో మాట్లాడేశారు కానీ.. నాకు 20 ఏళ్ల నుంచి దేవుడు ఇచ్చిన శక్తి మీరైతే నాకు దేవుడు ఇచ్చిన కుటుంబం మా కీరవాణి, జక్కన్న కుటుంబం. నా మంచి చెడ్డలలో, సుఖ దుఖాలలో.. నేను నా జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉన్న ఒకే ఒక్క కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను ఇక్కడికి ఒక కుటుంబ సభ్యుడిగానే వచ్చాను. నేను ఏరోజు ఈ కుటుంబానికి గెస్ట్ కాను.. కాలేను.. కాకూడదు కూడా. మా సాయి అన్న (సాయి కొర్ర‌పాటి) గురించి మాట్లాడాలంటే అంతే ఇబ్బంది పడుతున్నా.. 30 ఏళ్లుగా ఆయన పరిచయం నాకు. నాన్నగారితో చాలా సన్నిహిత్యంగా ఉండేవారు. నా సొంత మనిషి ఆయన. అందుకే నా సొంతం అనుకున్న వాళ్ల గురించి నేనే ఏమీ మాట్లాడలేను. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మా భైరవ, సింహాకి ఇంకో మెట్టు ఎదిగేలా హెల్ప్ అయ్యేలా దేవుడ్ని కోరుతున్నా. దర్శకుడు మణికంఠ హిట్ కొట్టాలని కోరుతున్నా.. పిల్లలు పుట్టిన తరువాత వాళ్లని ఎలా తీర్చిదిద్దాలి అనేది పెద్ద టాస్క్. నాకూ అదే ఆలోచనే. ప్రతి మగాడి విజయం వెనుకాల ఒక ఆడది ఉంటుంది.. ప్రతి కొడుకు సక్సెస్ వెనుకాల ఒక తల్లి ఉంటుంది. అలా ఈరోజు వీళ్ల పేరెంట్స్‌ని చూస్తే గర్వంగా ఉంది. ఈ సక్సెస్ సినిమాలకే పరిమితం కాకుండా.. రేపు వచ్చే యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నా’ అని.. రెండు మాటలే అని చాలానే మాట్లాడేశారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అరిచి గోల చేయడంతో.. వాళ్లని వారించారు ఎన్టీఆర్. గోల ఆపమని చెప్పాను.. అంటూ కాస్త సీరియస్ అయ్యారు ఎన్టీఆర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sef4fy

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...