Sunday 15 November 2020

Chaitanya: పెళ్లికి ముందే ఇంట్లోనే.. నిహారిక- చైతన్య చాలా ఫాస్ట్ గురూ!

మెగా డాటర్ చాలా ఫాస్ట్‌గా ఉంది. కాబోయే భర్తతో పెళ్లికి ముందే దీపావళి సంబరాలు చేసుకుంది. కాబోయే భార్యాభర్తలు నిహారిక- దీపావళి వేళ మెగా ఇంట సందడి చేశారు. నాగబాబు, వరుణ్ తేజ్‌లతో కలిసి ఆనందంగా పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫోటోలను నిహారిక స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటోంది నిహారిక- చైతన్య జోడీ. మూడు నెలల క్రిందట మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ తాను 'మిస్' నుంచి 'మిసెస్ నిహా'గా ప్రమోట్ అవుతున్నానని, తనకు కాబోయే భర్త ఇతనే అంటూ చైతన్య ఫోటోను స్వయంగా షేర్ చేసిన నిహారిక.. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్ధ కార్యక్రమాన్ని ఫినిష్ చేసేసింది. ఇక అప్పటినుంచి మెగా డాటర్ చేస్తున్న హంగామా అంతాఇంతా అని చెప్పలేం. కాబోయే భర్తతో షికార్లు కొడుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే చైతన్యతో పాటు తన స్నేహితులను వెంటబెట్టుకొని గోవా ట్రిప్ వేసి చిల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు పండగ వేళ మరోసారి చైతన్యతో సరదాగా గడిపింది నిహారిక కొణిదెల. Also Read: నిహారికకు కాబోయే భర్త పూర్తిపేరు జొన్నలగడ్డ వెంకట చైతన్య. ఇతను గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు. ఇకపోతే నిహారిక- చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుందని ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించారు నాగబాబు. అప్పటినుంచి పెళ్లి మూడ్ లోని వెళ్లిపోయిన నిహారిక, ఎప్పటికప్పుడు తనకు కాబోయేవాడితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్ల చేత ప్రేమ పక్షులం అనిపించుకుంటోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38I6LBt

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...