Friday 13 November 2020

British: బ్రిటీషర్లపై పూరి జగన్నాథ్ పొగడ్తల వర్షం.. మనం బావిలో కప్పలమంటూ సెన్సేషనల్ కామెంట్స్

వరుస పోడ్ కాస్ట్ ఆడియోల రూపంలో డాషింగ్ డైరెక్టర్ ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్నారు. నిజ జీవితంలో జరిగే విషయాలను ప్రస్తావిస్తూ యూత్‌ని మోటివేట్ చేస్తున్నారు. వందల ఏళ్ల కాలంనాటి సంగతులతో పాటు నేటి డిజిటల్ యుగం వరకూ అన్నింటిపై స్పదిస్తున్న ఆయన తాజాగా బ్రిటీషర్లపై తన అభిప్రాయాలు చెబుతూ ఓపెన్ అయ్యారు. బ్రిటీషర్లపై పొగడ్తలు కురిపిస్తూనే మన టాలెంట్ ఎలా బయటపెట్టుకోవాలో హిట్స్ ఇచ్చారు. బ్రిటిష్ పేరుతో పూరి విడుదల చేసిన ఈ పోడ్ కాస్ట్ ఆడియోలో ఆయన మాట్లాడుతూ.. ''మనందరికీ బ్రిటీష్ అంటే పడదు.. ఇది చాలా ఫెయిర్. గతం గతః కానీ ఓ సారి బ్రిటీష్ వాడి గురించి ఆలోచిద్దాం. ఇవాళ యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్రిటీషర్ల జనాభా కేవలం 6.5 కోట్లు. ఇప్పుడే అంత తక్కువగా ఉంటే.. 16వ శతాబ్దంలో వారి జనాభా 50 లక్షలు కూడా ఉండదు. అందులో నావికులు, సైనికులు అందరూ కలిసి 50 వేలు కూడా ఉండరు. అయినా వాళ్ళను రాయల్ నేవీ అనేవారు. సైజ్ చూస్తే వాళ్ళ కంటే మన దేశం 13 రెట్లు పెద్దది. అయినా సరే వాళ్లు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఎలా? అదే కసి. మనం హిమాలయాలు ఎక్కి అవతల ఏముందో చూడము. సరదాగా శ్రీలంక కూడా వెళ్లం. నూతిలో కప్పలం. అతి తక్కువ జనభా ఉన్న చిన్న దేశం నుంచి బ్రిటీష్ వాళ్లు వచ్చి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 22 దేశాలు తప్ప ప్రపంచంలో అన్ని దేశాలను ఆక్రమించారు. ప్రపంచంలో అందరికీ షర్టు, ఫ్యాంటూ వేయడం నేర్పించారు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లిష్ అందరికీ నేర్పించారు. ఆక్రమించిన దేశాలన్నింటినీ సొంత దేశాల్లా భావించి అభివృద్ధి చేశారు. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు నిర్మించారు. నట్లు, బోల్టులతో సహా అన్నింటినీ లండన్ నుంచే తెచ్చి అన్ని దేశాల్లో ఫ్యాక్టరీలు కట్టారు. కార్లు, ట్రామ్‌లు, గన్స్, షిప్‌యార్డులు, విమానాశ్రయాలు నెలకొల్పారు. అలాగే అన్నిదేశాల వారిని లండన్ తీసుకెళ్లి బారిష్టర్ చదివించారు. కొన్ని వందల షిప్పులు అన్ని దేశాలకు రోజూ వచ్చిపోతుండేవి. ఇన్ని చేయాలంటే బ్రిటిష్ వాళ్ళను ఎంత కసి, ఎంత విజన్ ఉంది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే.. ఇలా అన్ని దేశాల కోసం వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే ప్రతి దేశంలోనూ స్థానిక ప్రజల స్వాతంత్ర్య పోరాటం, రెండో ప్రపంచ యుద్ధంలో ఎదురు దెబ్బల కారణంగా వారికి చిరాకు వచ్చి చివరకు ఒక్కో దేశానికి వరుసగా స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ వెళ్లిపోయారు. యునైటెడ్ స్టేట్స్, ఆప్ఘనిస్థాన్, ఈజిప్టు, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇండియా, ఇజ్రాయిల్, మలేసియా, సౌత్ ఆఫ్రికా, జమైకా ఇలా ఎన్నో దేశాలకు స్వాతంత్య్రం ఇస్తూ 1984 వరకూ ఇస్తూనే వచ్చారు. అయితే ఒక్క దేశం మాత్రం మాకు స్వాతంత్ర్యం వద్దు. మమ్మల్ని పాలించండి. లేదంటే మా దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. దాంతో ఆ ఒక్కదేశాన్ని ఆధీనంలో ఉంచుకుని వాళ్ళు అనుకున్న విధంగా అభివృద్ధి చేసి 1997లో స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లిపోయారు. అదే హాంకాంగ్. అందుకే ఆ దేశం అలా ఉంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. బ్రిటీష్ వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది అడ్మినిస్ట్రేషన్. మనం పది ఊళ్లలో పది ఆఫీసులు పెట్టినా సరిగ్గా పనిచేయలేకపోతున్నాం. అలాంటిది, వందల దేశాలను పాలించాలంటే మాటలు కాదు. వాళ్లు ఎంత క్రమశిక్షణగా పనిచేశారో అర్థం చేసుకోండి. మంచి విషయం మన శత్రువులో ఉన్నా నేర్చుకోవాలి. మనం బ్రిటీషర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు'' అని అన్నారు. Also Read: Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IEmGpn

No comments:

Post a Comment

'AI Doesn't Care Where It Goes To School'

'No one manufactures intelligence at the moment.' from rediff Top Interviews https://ift.tt/FtDHBiR