Saturday 14 November 2020

చెర్రీ కాలికి బ్యాండ్ ఏంటి?... ‘ఆర్ఆర్ఆర్’ ఫోటోలతో కొత్త టెన్షన్

రామ్ చరణ్, హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘’. ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ యూనిట్ శుక్రవారం విడుదల చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ఎన్టీఆర్, చరణ్ సంప్రదాయ దుస్తులో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చారు. వీరిలో రాజమౌళి మాట్లాడుతున్నట్లు కొన్ని ఫోటోల్లో కనిపిస్తోంది. ఈ ఫోటోలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే.. మెగా అభిమానులు మాత్రం షాకవుతున్నారు. ఫోటోల్లో రామ్‌‌చరణ్ కాలికి పట్టీలో కనిపిస్తుండటమే దీనికి కారణం. దీంతో చెర్రీ కాలికి మళ్లీ గాయమైందా?..అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్రారంభమైనప్పుడు కూడా రామ్‌చరణ్‌ కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పట్లో వర్కౌట్లు చేస్తుండగా చరణ్ గాయపడినట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ చేతికి కూడా గాయం కావడంటో కొద్దిరోజులు షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు చరణ్ కాలికి బ్యాండ్ కనిపిస్తుండటంతో ఏం జరిగిందోనని ఫ్యాన్స్‌ టెన్షన్ పడుతున్నారు. దీనిపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IGgXiQ

No comments:

Post a Comment

'AI Doesn't Care Where It Goes To School'

'No one manufactures intelligence at the moment.' from rediff Top Interviews https://ift.tt/FtDHBiR