Saturday 14 November 2020

అక్కినేని వారసుడి లవ్ స్టోరీ.. ఆమెతో పెళ్లి పీటలెక్కిన యంగ్ హీరో.. పండగ వేళ స్పెషల్ ట్రీట్!!

అక్కినేని వారసుడు మరోసారి పెళ్లి పీటలపై కనిపించి ఆశ్చర్యపర్చారు. అప్పుడు హీరోయిన్ సమంతతో పెళ్లి పీటలెక్కిన ఆయన, ఇప్పుడు పెళ్లి దుస్తులతో మరో హీరోయిన్ పక్కన చేరారు. ఆగండాగండి.. ఎక్కడికో వెళ్లిపోకండి.. ఈ రెండు వేరు వేరు సందర్భాలు. రియల్ లైఫ్ భాగస్వామి సమంత కోసం అప్పుడు, రీల్ లైఫ్ భాగస్వామి సాయి పల్లవి కోసం ఇప్పుడు ఈ అక్కినేని వారసుడు నుదుట బాసింగం కట్టుకొని పెళ్లిపీటలెక్కారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే తన '' సినిమాలో నాగ చైతన్య- సాయి పల్లవి పెళ్లి చేశారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. దీపావళి కానుకగా 'లవ్ స్టోరీ' మూవీ నుంచి ఈ స్పెషల్ ఫోటో షేర్ చేస్తూ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. పెళ్లి దుస్తుల్లో నాగ చైతన్య- సాయి పల్లవిలను అలా పెళ్లి పీటలపై చూసి మురిపోతున్నారు నెటిజన్లు. కొందరైతే ఇంకాస్త ముందడుగేసి 'సమంతతో జాగ్రత్త సాయి పల్లవి' అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే ఈ పోస్టర్‌తో పండగ వేళ స్పెషల్ ట్రీట్ ఇచ్చారనే చెప్పుకోవాలి. Also Read: ఫీల్ గుడ్ కథలను తనదైన కోణంలో మలిచి యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ స్టోరీ మూవీ షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. అతిత్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3psiWs1

No comments:

Post a Comment

'AI Doesn't Care Where It Goes To School'

'No one manufactures intelligence at the moment.' from rediff Top Interviews https://ift.tt/FtDHBiR