Friday 13 November 2020

ఒక్క హిట్‌తో పెరిగిన మార్కెట్... సూర్యా ‘ఆకాశం నీ హద్దురా’...

‘గజినీ’తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ హీరో సూర్య.. ఇక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించినంతగా ఆకట్టుకోలేకపోవడంతో తెలుగులో మార్కెట్ పడిపోయింది. సెవెన్త్ సెన్స్, 24.. లాంటి సినిమాలు క్లాసికల్‌గా నిలిచాయి తప్ప కమర్షియల్ హిట్ సాధించలేకపోయాయి. ఇటీవల వచ్చిన ఎన్‌జీకే.. అయితే సూర్య మార్కెట్‌ను పూర్తిగా తగ్గించేసింది. తెలుగు రాష్ట్రాల్లో సూర్య స్వయంగా ప్రచారం చేసినా ఆ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తెలుగులో సూర్య మార్కెట్‌ పూర్తిగా పోయినట్లే అనుకుంటున్న సమయంతో వచ్చిన ‘’ ఆయనకు పునర్జన్మ ఇచ్చింది. విశ్లేషకుల నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. అసలు ఈ సినిమా ఓటీటీ విడుదల చేయకుండా థియేటర్లో రిలీజ్ చేస్తే మరింత హిట్ సాధించేదంటూ ప్రశంసలు దక్కతున్నాయి. సూర్య నటన, డైరెక్షన్ సూపర్బ్.. అంటూ కొనియాడుతున్నారు. ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘ఆకాశం నీ హద్దురా’కు వస్తున్న రెస్పాన్స్‌తో పండగ చేసుకుంటోంది. ఈ సినిమా విజయంతో ‘సూర్య ఈజ్ బ్యాక్’ అంటూ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘గజినీ’ తర్వాత సూర్యకు ఇదే బెస్ట్ కమ్ బ్యాక్ మూవీ అని సర్టిఫై చేస్తున్నారు. సినిమా పేరుకు తగినట్లుగానే సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ విజయం సూర్యకు తెలుగులో మార్కెట్‌ను ఎన్నో రెట్లు పెంచడం ఖాయమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సూర్య.. ఒక్క విజయంతో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lvpDrd

No comments:

Post a Comment

'AI Doesn't Care Where It Goes To School'

'No one manufactures intelligence at the moment.' from rediff Top Interviews https://ift.tt/FtDHBiR