Sunday 8 November 2020

నా పేరుకు ముందు హైపర్ అని అందుకే పెట్టారు.. అప్పట్లో అవన్నీ చూసి వాళ్లే డిసైడ్ అయ్యారు: హైపర్ ఆది

బుల్లితెర పంచ్ మహారాజ్ తాజాగా జరిగిన '' ప్రోగ్రామ్‌లో సరదాగా తన వ్యక్తిగత విషయాలన్నీ చెప్పాడు. వెండితెర స్టార్ కమెడియన్ ఆలీ, బుల్లితెర పాపులర్ కమెడియన్ హైపర్ ఆది ఇద్దరూ ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేశారు. ఈ నేపథ్యంలో తనదైన స్టైల్‌లో సరదా సరదాగా మాట్లాడుతూనే హైపర్ ఆది వ్యక్తిగత విషయాలను రాబట్టారు ఆలీ. ఇందులో భాగంగా మనోడి అసలు పేరు బయటపడింది. తన రియల్ నేమ్ హైపర్ ఆది కాదని, అయితే ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని చెప్పాడు బుల్లితెర కామెడీ కింగ్. తాజాగా ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో యాంకర్ వర్షిణితో కలిసి పాల్గొన్న హైపర్ ఆది.. తనదైన మాటలతో ఆకట్టుకున్నాడు. తాను జబర్ధస్త్ కమెడియన్‌గా పరిచయం కాకముందు సంగతులతో పాటు తన కుటుంబం, అసలు పేరు తాలూకు విషయాలపై రియాక్ట్ అయ్యాడు. తన అసలు పేరు ఆదయ్య అని చెప్పిన ఆయన, వాళ్ళ తాత గారి పేరే తనకు పెట్టారని తెలిపాడు. జబర్ధస్త్ షోకు వచ్చిన తర్వాత ఆదయ్య కాస్తా ఆదిగా మారిందని, కొన్ని రోజులకు ఆ పేరు ముందర హైపర్ కూడా చేరిపోయిందని అన్నాడు. Also Read: రెగ్యులర్‌గా తాను వేసే స్కిట్లు చూసి జబర్దస్త్ డైరెక్టర్లు హైపర్ అనే ట్యాగ్ లైన్ తన పేరుకు ముందు తగిలించారని, అలా ఆదయ్యను కాస్త హైపర్ ఆదిగా మారి మీ అభిమానాన్ని పొందుతున్నానని చెప్పాడు హైపర్ ఆది. మరోవైపు హైపర్ ఆది పెళ్లికి రెడీ అయ్యాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదని అన్నాడు. ఇకపోతే.. బుల్లితెరపై తనదైన పంచులేస్తూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసే హైపర్ ఆది ప్రస్తుతం పాపులర్ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు. బుల్లితెరపై చక్కిలిగింతలు పెడుతూనే అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తున్న ఆయన.. మంచి అవకాశం వస్తే హీరోగా కూడా రాణిస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eHmMZj

No comments:

Post a Comment

When Amitabh, Rajesh Khanna Broke The Ice

Amitabh Bachchan: 'Success didn't affect me at all.' from rediff Top Interviews https://ift.tt/mXlOqDN