Sunday 8 November 2020

Chiranjeevi Covid: నాగార్జునకి కోవిడ్ పరీక్షలు.! ఆందోళనలో బిగ్ బాస్ నిర్వాహకులు, చిరు-నాగ్-కేసీఆర్ భేటీలో నో మాస్క్

బిగ్ బాస్ సీజన్ 4ని విఘ్నాలు వీడటం లేదు.. కోవిడ్ టైంలో అసలు సీజన్ 4 ఉంటుందో ఉందదో అన్న సందేహాల నడుమ అతికష్టం మీద బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై 64 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. కంటెస్టెంట్స్ ఎంపిక సరిగా లేకపోవడం.. ఉన్న కంటెస్టెంట్స్ సరిగా పెర్ఫామ్ చేయలేకపోవడం.. ఓటింగ్ , ఎలిమినేషన్ విషయంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో బిగ్ బాస్ ఆట అతికష్టంపై సాగుతోంది. రేటింగ్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. టాప్ రేటింగ్ విషయాన్ని పక్కన పెడితే.. చిన్న చిన్న సీరియల్స్‌ని రేటింగ్‌ని కూడా బీట్ చేయలేకపోతుంది బిగ్ బాస్. అయితే మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్టు బిగ్ బాస్ ఆటను కోవిడ్ భయం వెంటాడుతోంది. హోస్ట్ నాగార్జునకు కోవిడ్ పరీక్షలు అత్యవరసరం కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఆందోళనలో ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ బారిన పడ్డారు. ఆచార్య షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కోవిడ్ పరీక్షలు చేయించగా.. మెగాస్టార్‌కి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన చిరంజీవి.. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని.. రిజల్ట్ పాజిటివ్ అని.. ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని తెలియజేశారు. వెంటనే హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపిన చిరు.. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరారు. అయితే శనివారం (నవంబర్ 09) నాడు మెగాస్టార్ చిరంజీవితో నాగార్జున భేటీ కావడంతో బిగ్ బాస్ నిర్వాహకుల్లో అలజడి మొదలైంది. ఈ మధ్య హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడంతో.. తెలుగు చిత్రసీమ తరుపున సహాయం అందించేందుకు రెండురోజుల క్రితం శనివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు చిరంజీవి, నాగార్జున. ఇదే భేటీలో నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో 1500-2000 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సిటీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సోమవారం నాడు చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ అని బాంబ్ పేల్చడంతో పాటు గత నాలుగైదు రోజుల్లో తనని కలిసిన వారందర్నీ కరోనా టెస్ట్‌లు చేసుకోవాలని కోరడంతో ఇప్పుడు కేసీఆర్‌తో పాటు నాగార్జునకు కూడా కరోనా టెస్ట్‌లు తప్పనిసరి అయ్యింది. దీంతో సోమవారం నాడు నాగార్జునకు కోవిడ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నాగార్జునకి కోవిడ్ పరీక్షల నేపథ్యంలో ఆందోళనలో ఉంది బిగ్ బాస్ యూనిట్. కేసీఆర్-చిరంజీవితో జరిగిన భేటీలో కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు నాగార్జున, చిరంజీవి, కేసీఆర్‌లు. చాలా దగ్గరగా ఉండి మాస్క్ లేకుండా మాట్లాడుకున్నారు. ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్ వస్తే పర్లేదు.. కానీ నాగార్జునకి పాటిజివ్‌గా నిర్థారణ అయితే హోస్ట్ ఎవరు చేయాలన్న దానిపై ఆలోచనలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్‌‌తో బిగ్ బాస్‌కి బ్రేక్ ఇచ్చినప్పుడు కోడలు సమంత హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఒకవేళ నాగార్జున హోమ్ క్వారంటైన్ చేయాల్సి వస్తే.. కోడలు సమంతకే బిగ్ బాస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా నాగార్జునకు కోవిడ్ పాజిటివ్ రాకుండా ఉండాలనే కోరుకుందాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mY3H8m

No comments:

Post a Comment

When Amitabh, Rajesh Khanna Broke The Ice

Amitabh Bachchan: 'Success didn't affect me at all.' from rediff Top Interviews https://ift.tt/mXlOqDN