Sunday, 1 November 2020

కొత్త జీవితం.. కొత్త ఇల్లు.. అదిరిందమ్మా కాజల్!

హీరోయిన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును శుక్రవారం ఆమె వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, పెళ్లయిన తరవాత రోజే అంటే శనివారం కాజల్, గౌతమ్ దంపతులు తమ కొత్త ఇంటిలో గృహప్రవేశం చేశారు. నూతన దంపతులతో పాటు కాజల్ తల్లిదండ్రులు వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్, సోదరి నిషా ఫ్యామిలీ, అలాగే గౌతమ్ కిచ్లు కుటుంబ సభ్యులు ఈ గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు. పెళ్లికి ముందే ఈ డ్రీమ్ హౌస్‌ను కాజల్, గౌతమ్ కొనుగోలు చేశారు. కాజల్ అగర్వాల్ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసిన విషయాన్ని ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ఖరారు చేశారు. ‘‘పెళ్లి జరిగిన తరవాత రోజు ఉదయమే అక్క, బావ వారి డ్రీమ్ హోమ్‌లో గృహప్రవేశం చేశారు. ఇల్లు చాలా అందంగా ఉంది. గృహప్రవేశ వేడుక కూడా సంప్రదాయబద్ధంగా జరిగింది. వాళ్లిద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్లను చూసి మేమంతా ఎంతో గర్వపడుతున్నాం. కొత్త పెళ్లయినవారికి నిర్వహించే పూజా కార్యక్రమాన్ని త్వరలోనే జరిపిస్తాం’’ అని నిషా వెల్లడించారు. Also Read: హోమ్ డెకార్, ఇంటీరియర్ డిజైన్ కంపెనీకి వ్యవస్థాపకుడు అయిన గౌతమ్ కిచ్లుతోపాటు కాజల్ అగర్వాల్‌కు ఈ ఇల్లు ఎంతో ప్రత్యేకమని నిషా అన్నారు. ఈ ఇంటి కోసం కాజల్, గౌతమ్ ఇద్దరూ ఎంతో కసరత్తు చేశారని, అద్భుతమైన డిజైన్‌తో తమ కలల ఇంటిని నిర్మించుకున్నారని ఆమె తెలిపారు. ఈ ఇంటి గురించి తన కన్నా అక్కాబావలు కాజల్, గౌతమ్ చెబితేనే బాగుంటుందని నిషా అభిప్రాయడ్డారు. ఇదిలా ఉంటే, ముంబైలోని ప్రముఖ స్టార్ హోటళ్లలో ఒకటైన తాజ్ మహల్ ప్యాలెస్‌లో కాజల్, గౌతమ్ వివాహ వేడుక జరిగింది. పంజాబీ, కశ్మిరీ సంప్రదాయల కలయికతో ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. తన దుస్తులు, ఆభరణాల విషయంలో కాజల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పెళ్లి వేడుకను చాలా గొప్పగా నిర్వహించాలనేది కాజల్ డ్రీమ్ అని ఆమె సోదరి నిషా చెప్పారు. ఆమె అనుకున్నట్టుగానే పెళ్లి చాలా బాగా జరిగిందని ఆమె వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37ZkPpT

No comments:

Post a Comment

'Don't Compel Us To Study Hindi!'

'We are not opposed to any Indian language. We are against Hindi imposition.' from rediff Top Interviews https://ift.tt/m1ozKQM