Sunday, 1 November 2020

క్యాచీ టైటిల్‌తో వస్తున్న గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్

రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్. ప్రతిభ గల యువ దర్శకులను ప్రోత్సహిస్తూ వస్తున్న ఆయన ఇటీవలే థ్రిల్లింగ్ మూవీ 'వలయం'తో ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో ''గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో ఎన్నడూచూడని ఆసక్తికర కథతో ఈ 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' మూవీ రూపొందుతోందని అంటున్నారు యూనిట్ సభ్యులు. గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే క్యాచీ అండ్ క్రేజీ టైటిల్‌కి తోడు ప్రేక్షకులు థ్రిల్ అయ్యే కథాంశాన్ని యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య తెరకెక్కిస్తున్నారని యూనిట్ చెబుతోంది. నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండనున్నాయట. డిసెంబర్ నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. Also Read: ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్ పోస్టర్ కొద్దిసేపటి క్రితం (నవంబర్ 1న సాయంత్రం 5 గంటలకు) విడుదల చేశారు. హీరో లుక్ పూర్తిగా రివీల్ చేయకుండా అట్రాక్టివ్‌గా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. హిట్ చిత్రాల సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. చిత్రంలో నటించే నటీనటులు, ఇతర వివరాలను అతిత్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34JisFN

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...