Sunday, 1 November 2020

వైభవంగా సిరివెన్నెల కుమారుడు రాజా వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు

దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు (రాజా భవాని శంకర శర్మ) ఓ ఇంటివాడయ్యారు. వెంకటలక్ష్మి హిమబిందుని ఆయన నిన్న (అక్టోబర్ 31న) పెళ్లాడారు. రాజా, హిమబిందు వివాహ వేడుక చాలా తక్కువ మంది అతిథులు, కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో ఉదయం 10.55 గంటలకు జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి.. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. See Photos: సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆప్తుడు అయిన త్రివిక్రమ్ సంప్రదాయ షేర్వాణి ధరించి పెళ్లికి హాజరయ్యారు. షేర్వాణి రంగుకు మ్యాచ్ అయ్యేటట్టు మాస్క్ కూడా డిజైన్ చేయించుకున్నారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పెళ్లి వేడుకను నిర్వహించారు. చాలా తక్కువ మంది అతిథులు, శానిటైజర్స్, మాస్క్‌లు, భౌతిక దూరం పాటించారు. కాగా, తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను రాజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అని విడివిడిగా ఫొటోలను పోస్ట్ చేశారు. తెలుపు రంగు షేర్వాటి, దానిపై కోటు ధరించిన రాజా.. ఆ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఇక హిమబిందు పట్టుచీర, బంగారు ఆభరణాలు ధరించారు. ఫొటోల్లో హిమబిందు చాలా హుషారుగా కనిపిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టించిన తరవాత మూడు ముళ్ల బంధంతో రాజా, హిమబిందు ఒక్కటయ్యారు. కాగా, ఆగస్టు 15న రాజా, హిమబిందుల నిశ్చార్థం జరిగింది. ఈ విషయాన్ని రాజానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే, తనకు కాబోయే భార్య పేరు హిమబిందు అని ఆరోజు రాజా వెల్లడించలేదు. ఇప్పుడు పెళ్లి సందర్భంగా తన అర్థాంగిని పరిచయం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇద్దరు కుమారుల సంతానం. చిన్న కుమారుడు రాజా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పెద్ద కుమారుడు యోగేశ్వర్ శర్మ సంగీత దర్శకుడిగా ప్రయత్నిస్తున్నారు. రాజా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ‘ఎవడు’, ‘ఫిదా’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘అంతరిక్షం’, ‘మిస్టర్ మజ్ను’, ‘రణరంగం’, ‘చాణక్య’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘భానుమతి & రామకృష్ణ’ వంటి సినిమాల్లో నటించారు. రాజా మంచి నటుడే అయినా ఇంకా సరైన గుర్తింపు ఆయనకు రాలేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34Jy9g0

No comments:

Post a Comment

'Congress Has Many Capable Leaders...'

'Maybe this has created some minor issues which can happen in any party.' from rediff Top Interviews https://ift.tt/lRkZP1O