Sunday, 1 November 2020

యాంకర్ సుమ, సోనూ సూద్‌లకు అవార్డులు

వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి ప్రతిష్టాత్మకంగా అందించే డాక్టర్ రామినేని ఫౌండేషన్‌ పురస్కారాలను ఈ ఏడాది కూడా ప్రకటించారు. సంస్థ చైర్మన్‌ రామినేని ధర్మచక్ర, కన్వీనర్‌ పాతూరి నాగభూషణం శనివారం ఈ పురస్కారాలను ప్రకటించారు. నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులుకు విశిష్ట పురస్కారం ప్రకటించారు. సినీ నటుడు, సంఘ సేవకుడు సోనూ సూద్‌‌ను ప్రత్యేక పురస్కారం వరించింది. అలాగే, ప్రముఖ వ్యాఖ్యాత కనకాల విశేష పురస్కారం అందుకోనున్నారు. వీరితోపాటు బ్యాడ్మింటన్‌ అంపైర్‌ వేమూరి సుధాకర్‌, సంఘ సేవకుడు బండ్లమూడి శ్రీనివాస్‌కు విశేష పురస్కారాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్వరలో అవార్డుల ప్రదాన తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. 1999లో రామినేని ఫౌండేషన్‌ను ఆరంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది 2007 వరకు అవార్డులు అందజేశారు. మళ్లీ 2018లో ప్రముఖ ఉపన్యాసకుడు, రచయిత గరికపాటి నరసింహారావుకు విశేష పురస్కారం అందించారు. ఇప్పుడు 2020కి గాను అవార్డులను ప్రకటించారు. నటుడు లాక్‌డౌన్ సమయంలో అందించిన సేవల గురించి అందరికీ తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌లో సోనూ చేసిన సేవలను చూసిన ప్రజలు ఆయన్ని రియల్ హీరో అంటూ ప్రశంసించారు. లాక్‌డౌన్‌లో ఉపాధి కోల్పోయిన ఎంతో మంది వలస కూలీలను సోనూ సూద్ ఆదుకున్నారు. ముంబైలో ఎంతో మంది వలస కూలీలకు తిండి పెట్టారు. ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటుచేసి వలస కూలీలను ముంబై నుంచి తమ స్వస్థలాలకు పంపించారు. స్వయంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేసి విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించారు. అలాగే, కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా వలస కూలీలను ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు చేర్చారు. ప్రస్తుతం చిన్న పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సోనూ సూద్ గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. ఇక సుమ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. బుల్లితెరకు ఆమె చేసిన సేవ అద్వితీయం. సుమారు మూడు దశాబ్దాలుగా నటిగా, యాంకర్‌గా, హోస్ట్‌గా టీవీ, సినీ పరిశ్రమకు ఆమె ఎంతో సేవ చేశారు. దీనికి గుర్తుగా ఆమెకు పురస్కారం ప్రకటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jIntml

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk