ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న దర్శకధీరుడు .. తన తుదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జక్కన్న అదిరిపోయే స్టోరీ లైన్ రెడీ చేశారని, ప్యాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా నిర్మించనున్నారని ప్రచారం జరిగింది. దీంతో ఈ విలక్షణ కాంబోపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమాపై రియాక్ట్ అవుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు జక్కన్న. మహేష్‌తో సినిమా ఎలా ఉండబోతోంది? దానిపై ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఒక సినిమా చేసేటపుడు మరో సినిమా గురించి ఆలోచించనని, ముందు నుంచీ నేనింతే అని చెప్పారు రాజమౌళి. RRR మూవీ పూర్తయితే కానీ మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఆలోచించన చేస్తాను తప్ప ఇప్పుడే చెప్పలేనని అన్నారు. దీంతో మహేష్ బాబు- రాజమౌళి సినిమా కథాంశం విషయమై వస్తున్న రూమర్స్‌కు చెక్ పడినట్లయింది. Also Read: మరోవైపు మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాను జేమ్స్ బాండ్ లేదా కౌబాయ్ తరహా యాక్షన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారని రాజమౌళి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు తన తండ్రి విజయేంద్రప్రసాద్‌కి బలమైన కథ రెడీ చేయాల్సిందిగా చెప్పారని టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా సినిమా విశేషాలను సీక్రెట్‌గా ఉంచడానికే తన మొదటి ప్రాధాన్యత అని తాజా ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పేశారు రాజమౌళి. సో.. చూడాలి మరి ఇకనైనా మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాపై రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడుతుందా.. లేదా? అనేది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30wCO2o
No comments:
Post a Comment