ఇప్పటివరకు జీవితంలో కష్టం, సుఖం.. అప్పుల బాధలు, లగ్జరీ అన్నీ ఎదుర్కొని ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డారు నాగబాబు. నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మెగా బ్రదర్‌కి 'ఆరెంజ్' మూవీ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిన సంగతి మనందరికీ తెలుసు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన తీవ్రంగా నష్టపోయారు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పిన ఆయన.. తాజాగా ఓ వీడియో ద్వారా 'ఆరెంజ్' మూవీ తర్వాత చేసిన అప్పులు, ఎదుర్కొన్న కష్టాలు.. ఆ తర్వాత వాటినుంచి బయటపడిన విధానాన్ని వివరించారు. ''నా లైఫ్‌లో ఆర్ధికంగా చాలా నష్టపోయిన విషయం మీ అందరికీ తెలుసు.. ఆ తర్వాత చేసిన తప్పులు తెలుసుకొని మళ్ళీ జీవితంలో అలాంటి పరిస్థితి రాకూడదని కష్టపడి డబ్బు సంపాదించా.. అందుకే ఈ మనీ సిరీస్‌పై తనకు మాట్లాడే అర్హత ఉంది'' అంటూ ఆలోచనలు రేకెత్తించే విషయాలు చెప్పారు నాగబాబు. ఆరెంజ్ సినిమాతో తన జీవితంపై గట్టిగానే దెబ్బ పడిందని, కోలుకోలేనంతగా ఆర్థిక నష్టాలు వచ్చాయని అన్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించడం, టీవీ సీరియల్స్, జబర్దస్త్ లాంటి కొన్ని టీవీ షోలు చేయడం మొదలుపెట్టి తీవ్రంగా శ్రమించాలని తెలిపారు. 2010లో నెలకు తక్కువలో తక్కువగా తనకు లక్ష యాభై వేలు అవసరం ఉండగా.. ఆ సమయంలో తన ఆదాయం లక్ష రూపాయలే అని చెప్పారు. ఆర్థికంగా 50 వేల లోటుతో జీవితం సాగించానని చెప్పారు నాగబాబు. Also Read: ఒక్కసారిగా కోట్లు సంపాదించాలని అనుకోవడం సరికాదని భావించి ప్రతి ఆరు నెలలకు ఓ సారి తన లక్ష్యాన్ని మార్చకుంటూ వెళ్ళా. మొదట్లో ఆరునెలకు మూడు లక్షలు, ఆ తర్వాత ఆరు నెలలకు ఏడు లక్షలు అలా ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని సెట్ చేసుకుని ముందుకెళ్లా. ఇప్పటికి నా టార్గెట్ రీచ్ అయ్యాను అని నాగబాబు తెలిపారు. ఒక్కసారే 50 కోట్లు సంపాదించాలనే టార్గెట్ కంటే ఎప్పటికప్పుడు చిన్నచిన్నగా టార్గెట్ చేసుకోవడం.. వాటిని అధిగమించడం మంచిదని, అదే మన భవిష్యత్‌ని నిలబడుతుందని ఆయన చెప్పారు. ఇక నాగబాబు నష్టపోయిన ఆరెంజ్ సినిమా విషయానికొస్తే.. ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఆ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు మెగా బ్రదర్. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను భారీ హంగులతో నిర్మించారు.. కానీ ఈ మూవీ అంచనాలు తలక్రిందులు చేస్తూ ప్రేక్షకుల ముందు చతికిలపడింది. దీంతో అప్పులపాలైన నాగబాబు.. సరైన ఫైనాన్సియల్ ప్లానింగ్‌తో తిరిగి డబ్బు సంపాదించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36wKJRc
No comments:
Post a Comment