Saturday, 24 October 2020

Kajal: కాజల్ లైవ్ టెలికాస్ట్‌.. పెళ్లికి ముందే భయపెట్టిన ముద్దుగుమ్మ! వీడియో వైరల్

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అగర్వాల్ అక్టోబర్ 30వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడబోతున్న ఈ బ్యూటీ.. పెళ్లికి వారం రోజుల ముందే తన లుక్‌తో భయపెట్టింది. ఆమె తొలి వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్' ఫస్ట్ లుక్‌లో కాజల్ రూపం చూసి షాకవుతున్నారు ఆడియన్స్. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ గతంలో ఎన్నడూ కనిపించని విలక్షణ పాత్రలో కనిపించబోతోంది. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వెబ్ సిరీస్‌ల బాట పడుతున్నారు నేటితరం హీరోయిన్స్. దానికి తోడు ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌కి క్రేజ్ అమాంతం పెరగడంతో సమంత, తమన్నా, కియారా అద్వానీ, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ సైతం ఆన్‌లైన్ వేదికలపై అలరించేందుకు రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కూడా తొలిసారి 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే క్లియర్‌గా అర్థమవుతోంది. Also Read: కాజల్ అగర్వాల్ నటించిన ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ కావడానికి రెడీగా ఉంది. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా ఇది రూపొందుతోంది. ఇందులో కాజల్‌తో పాటు వైభవ్, ఆనంది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తన తొలి వెబ్ సిరీస్ 'లైవ్ టెలికాస్ట్' ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్‌ని సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానుల ముందుంచింది కాజల్. ఇవి చూసి.. పెళ్లికి భయపెట్టావ్‌గా కాజల్! అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35x4o1l

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr