
తెలుగు సినిమా పరిశ్రమలో డైరెక్టర్ క్రిష్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమా ‘గమ్యం’తోనే తానేంటో నిరూపించుకున్న క్రిష్ తర్వాతి సినిమాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. టేకింగ్‌తో పాటు సినిమాలను అందరికంటే వేగంగా తెరకెక్కించడం ఆయనతో మరో ప్రత్యేకత. బాలకృష్ణ 100వ చిత్రమైన `గౌతమిపుత్ర శాతకర్ణి` లాంటి చారిత్రక చిత్రాన్ని పరిమిత బడ్జెట్‌లో కేవలం 80 రోజుల్లోనే అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. Also Read: తనలోని స్పీడ్‌ను మరోసారి నిరూపించి ఇండస్ట్రీని ఆకట్టుకున్నారు క్రిష్. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. అటవీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా భాగం వికారాబాద్ పారెస్ట్‌లోనే చిత్రీకరించారు. కరోనా, భారీ వర్షాలను లెక్క చేయకుండా టాకీ భాగం మొత్తాన్ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారు.
మిగిలి ఉన్న ఒక్క పాటను మరో ఐదు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేవలం 40 రోజుల్లోనే క్రిష్ షూటింగ్‌ను పూర్తి చేస్తుండటం పట్ల హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సంతోషం వ్యక్తం చేసింది. ఇంకా ‘డ్రీమ్ టీమ్.. డ్రీమ్ రోల్’ ఒక్క పాట షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dPWrYQ
No comments:
Post a Comment