Saturday, 24 October 2020

తొలిప్రేమ హీరోయిన్‌కి ఎన్సీబీ నోటీసులు.. డ్రగ్స్ ఉచ్చులో పడి జంప్!! ఇదే అసలు ట్విస్ట్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన డ్రగ్స్ ఇష్యూలో ఇప్పటికే ఎందరో సినీతారల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ అధికారులు కూపీ లాగుతున్న కొద్దీ డ్రగ్స్ రాకెట్‌లో ఉన్న ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. బీ టౌన్‌తో పాటు పలువురు సౌత్ ఇండియన్ స్టార్స్‌కి కూడా డ్రగ్స్ పెడల్స్‌తో సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో తొలిప్రేమ సినిమాలో నటించిన హీరోయిన్ డ్రగ్స్ రాకెట్‌లో చిక్కుకుంది. లోతుగా విచారణ చేపట్టి ఇప్పటికే స్వప్న పబ్బికి నోటీసులు జారీ చేశారు ఎన్సీబీ అధికారులు. కానీ ఆమె మాత్రం అధికారులకు చిక్కకుండా ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. దీంతో ఆమెపై అనేక రూమర్స్ బయటకొచ్చాయి. స్వప్న పబ్బి కోసం ఎన్సీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని, అయితే ఎవ్వరికీ దొరకకుండా ఆమె తప్పించుకు తిరుగుతోందని వార్తలు వస్తున్నాయి. దీంతో తాజాగా ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన స్వప్న పబ్బి.. తగు వివరణ ఇచ్చింది. Also Read: తనకు ఎన్సీబీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే గానీ, అజ్ఞాతంలోకి వెళ్లానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్వప్న పబ్బి పేర్కొంది. మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలు చూసి షాక్ అయ్యానని తెలిపింది. నిజానికి తాను లండన్‌లో ఫ్యామిలీతో ఉన్నానని, తన తరుఫున తన లాయర్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పింది. తన గురించిన పూర్తి సమాచారం అధికారుల వద్ద ఉందని పేర్కొన్న ఆమె.. సరైన ఆధారాలు లేకుండా వార్తలు రాస్తుండటం చూస్తే బాధేస్తోందని తెలిపింది. వరుణ్ తేజ్ హీరోగా ఇటీవలే వచ్చిన 'తొలిప్రేమ' సినిమాలో స్వప్న పబ్బి నటించింది. సునయన పాత్రలో కనిపించిన ఆమె వరుణ్ తేజ్‌తో కలిసి స్టెప్పులు కూడా వేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి 'డ్రైవ్' మూవీలో నటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oqltT1

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD