కారణంగా సామాన్య ప్రజలతో పాటు సెలబ్రెటీలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులు కనిపించకపోతే వాళ్లు కరోనా బారిన పడ్డారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో ప్రముఖ నటుడు తాజాగా ఇలాంటి రూమర్స్‌తో ఇబ్బందులు పడ్డారు. దీంతో తనకు కరోనా సోకలేదని, బాగానే ఉన్నానంటూ ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రకటించాల్సి వచ్చింది.
ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ జయంతిని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం గురువారం (అక్టోబర్ 1) స్మారక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే శివాజీ కుమారుడు, నటుడు ప్రభు మాత్రం ఆ కార్యక్రమంలో కనిపించలేదు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డారని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని.. అందుకే స్మారక కార్యక్రమానికి హాజరు కాలేదని సోషల్‌మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభు... తాను కరోనా బారిన పడలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. కొద్దిరోజుల క్రితం తన కాలు బెణకడంతో నడవడం కష్టంగా ఉందని, అందువల్లే నాన్నగారి స్మారక కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తెలుగులో డార్లింగ్, ఆరెంజ్, శక్తి, బెజవాడ, ఊ.. కొడతారా ఉలిక్కిపడతారా, దరువు, దేనికైనా రెడీ, ఒంగోలు గిత్త, వీడెవడు.. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Sl3jmS
No comments:
Post a Comment