తెలుగు సినీ మ్యూజిక్ డైరెక్టర్ అగస్త్యపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-63/ఏలో నివాసముండే బోయలపల్లి అగస్త్య తెలుగులో కొన్ని సినిమాలకు సంగీతం అందించారు. సెప్టెంబర్ 9వ తేదీన ఆయన ఇంట్లో ఉన్న సమయంలో చిట్టి నాగార్జునరెడ్డి, చిట్టి అనుషారెడ్డి, శ్రావ్య అనే ముగ్గురు వచ్చారు. అగస్త్య డోర్ తీయగానే వారంతా కలిసి ఆయనపై దాడికి పాల్పడి సెల్‌ఫోన్ల లాక్కుని పరారయ్యారు. ఈ క్రమంలోనే అగస్త్య కుడిచేయి విరిగింది.
దీంతో ఆయన నేరుగా సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. కోలుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అగస్త్య గురువారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక పరమైన లావాదేవీల వల్లే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అగస్త్య.. కమినా(2013, మరుముగమ్(2014), గరం(2016) చిత్రాలకు సంగీతం అందించారు. Also Read:from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34hhRtr
No comments:
Post a Comment