ప్యాన్ ఇండియా స్టార్ అనగానే దక్షిణాది ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో తన క్రేజ్ ఎల్లలు దాటించిన ఈ యువ హీరో తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించారు. వెండితెరపైనే కాదు ఆన్‌లైన్ తెరపై కూడా బాహుబలినే అని నిరూపించుకున్నారు. దక్షిణాదిలోనే అత్యధిక మంది ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌ని కూడగట్టుకున్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు. నిజానికి మిగితా హీరోలతో పోల్చితే సోషల్ మీడియాలో ప్రభాస్ అంత యాక్టివ్ కాదని చెప్పొచ్చు. అందరిలా కాకుండా అడపాదడపా ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు ప్రభాస్. అయినప్పటికీ ఫాలోవర్స్ పరంగా మాత్రం మనోడికి డోకాలేదు. రోజు రోజుకీ ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రస్తుతం దక్షిణాదిలో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా తన పేరు లిఖించుకున్నారు ప్రభాస్. Also Read: మూడు నెలల క్రితమే 15 మిలియన్స్ ఫాలోయర్స్‌తో అల్లు అర్జున్‌ని క్రాస్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు 20 మిలియన్ మార్క్‌ను టచ్ చేసి మరో ఫీట్ అధిగమించారు. దీంతో సౌత్‌లోనే ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది ఫాలోయర్స్ ఉన్న ఘనత ప్రభాస్ సొంతమైంది. అంతేకాదు దక్షిణాది సినీ తారల్లో 20 మిలియన్స్ ఫాలోవర్స్ సాధించిన తొలి హీరోగా ఈయన రికార్డు సృష్టించడం విశేషం. ఈ మేరకు తన అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పారు ప్రభాస్. Also Read: ఇక ఈ యంగ్ రెబల్ స్టార్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చేస్తున్న ప్రభాస్, మరో రెండు భారీ బడ్జెట్ సినిమాలకు ఓకే చెప్పారు. ఇందులో ఒకటి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, మరొకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. కాగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు 'ఆదిపురుష్' అని టైటిల్ ఫిక్స్ చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34d6brG
No comments:
Post a Comment