కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మాత వెంకటేష్ కొత్తూరి రూపొందిస్తున్న చిత్రం ''. ఈ మూవీలో హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కుమార్.కె దర్శకత్వం వహించాడు. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన బలమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే చిత్ర షూటింగ్ ఫినిష్ అయింది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది. కలర్‌ఫుల్‌గా యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ.. ''ప్రస్తుతం మెరిసే మెరిసే చిత్రం డిఐ వర్క్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మా మూవీ ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది'' అన్నారు. Also Read: ఈ చిత్రంలో సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ కొడగండ్ల సంగీతం అందిస్తున్నాడు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ccMx2B
No comments:
Post a Comment