బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అందాదున్' తెలుగు రీమేక్‌లో తమన్నాను ఫైనల్ చేస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేర్పులు చేసి హీరోగా ఈ సినిమాను టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, చెల్లెలు నిఖితా రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్ నభా నటేష్‌ని కన్ఫర్మ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా కూడా ఇందులో భాగం కానున్నట్లు ప్రకటించింది. ఒరిజినల్ వర్షన్‌లో రాధికా ఆప్టే పోషించిన రోల్ నభా నటేష్ చేయనుందని, అలాగే పవర్‌ఫుల్ టబు రోల్‌లో తమన్నా కనిపించనుందని తెలిపారు. 'అందాదున్' మూవీలో టబు పోషించిన పాత్ర సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ అయి మూవీ విజయంలో కీలకం అయింది. దీంతో ఈ రీమేక్‌లో కూడా ఆమెనే తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడంతో ఆ రోల్ కోసం ఇలియానా, శ్రీయ, నయనతార, రమ్యకృష్ణ లాంటి హీరోయిన్ల పేర్లు పరిశీలించి చివరకు తమన్నాను సెలక్ట్ చేశారు మేకర్స్. Also Read: డిమాండ్ ఉన్న పాత్ర, పైగా సినిమాలో కీలకమైన రోల్ కావడంతో తన వద్దకు ఈ అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పిందట తమన్నా. దీంతో ఇప్పటిదాకా గ్లామర్ రోల్స్ పోషించిన మిల్కీబ్యూటీ ఇప్పుడీ పవర్‌ఫుల్ రోల్ ఎలా డీల్ చేస్తుందనే ఆసక్తి నెలకొంది ప్రేక్షకుల్లో. కాగా ఈ సినిమాలో నటించాలంటే కాస్త భయంగా ఉందని, `అంధాదున్`లో హీరోగా నటించిన ఆయుష్మాన్ పాత్ర తనకు ఛాలెంజింగ్ రోల్ అని ఇటీవలే తెలిపాడు నితిన్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3myd5QB
No comments:
Post a Comment