Saturday, 22 February 2020

అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నిహారిక.. పొంగిపోతున్న మెగా ఫ్యాన్స్

మెగాడాటర్ కొణిదెల ఈ మధ్య కాలంలో వెరీ హాట్ గురూ అనిపించేలా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కెరియర్ స్టార్టింగ్‌ నుండి వెరీ డీసెంట్ అనిపించుకున్న నిహారిక.. ఇలా అయితే ఇక లాభం లేదు అనుకుందో ఏమో కాని హాట్ డోస్ పెంచేసింది. వరుసగా కైపెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ మెగా డాటర్.. ‘మెగా ఘాటు’ అనిపిస్తోంది. ముఖ్యంగా నిహారిక ఇన్ స్టాగ్రామ్‌కి మంచి ఫాలోయింగ్ ఉండటంతో వరుస హాట్ ఫొటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. కాగా ఆమె హాట్ డోస్ పెంచేయడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న తరుణంలో సాంప్రదాయ బద్దమైన దుస్తుల్లో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది నిహారిక. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో పట్టుచీర కట్టి.. సాంప్రదాయ బద్ధంగా నిండైన వస్త్రాలు ధరించి ‘నేను నమ్ముతున్న దానికే అసలు విలువ’ అంటూ ఫొటో క్యాప్షన్ ఇచ్చింది నిహారిక. ట్రెడిషనల్ లుక్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు. ‘అచ్చం బుట్టబొమ్మలా ఉన్నావు.. చూడ చక్కని తెలుగింటి ఆణిముత్యంలా.. చురు మందహాసం నీకే చెల్లు.. ఇకపై కూడా ఇలాగే ఉండండి అంటూ మెగా ఫ్యాన్స్ సలహాలు ఇస్తూ లైక్‌లు, షేర్‌ల మోత మోగిస్తున్నారు. కొందరైతే అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సిస్టర్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకమనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యాకాంతం తదితర చిత్రాల్లో నటించిన నిహారికకు సరైన గుర్తింపు రాకపోవడంతో ఇక సినిమాలకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యే ఆలోచనలో ఉందనే వార్తలు వచ్చాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రంలో నటించి.. తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నప్పటికీ ఆమెకు పెద్దగా ఉపయోగపడలేకపోయింది ఆ పాత్ర. దీంతో తనకు అచ్చొచ్చిన వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తోంది నిహారిక. పింగ్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు సంపాదించిన నిహారిక ప్రస్తుతం మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్‌ను చేస్తోంది నిహారిక.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VeMQU0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....